ఏపీ రాజధానిపైగా అమరావతి ఉండకూడదంటూ పిచ్చి వ్యతిరేకతను పెంచుకున్న ప్రభుత్వం ఏం చేస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. కోర్టుల్లో.. ఎన్నెన్ని పిటిషన్లు వేశారో స్పష్టత లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో శివరామకృష్ణన్ కమిటీ నివేదికలు అమలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ నాగరత్నలతో కూడిన ధర్మానసం విచారణ కూడా జరిపింది. అయితే న్యాయవాదులు హాజరు కాకపోవడంతో రెండు వారాలకు వాయిదా వేసింది.
కానీ ప్రభుత్వం ఇలాంటి పిటిషన్ వేసిందని తెలిసిన తర్వాత .. న్యాయవాద వర్గాలు కూడా ఆశ్చర్యానికి లోనయ్యాయి.. ఇప్పటికే రాజధాని అంశంపై ఓ పిటిషన్ విచారణలో ఉంది. మూడు రాజధానుల పేరుతో ప్రభుత్వం చేస్తున్న రాజకీయం క్లైమాక్స్ కు వచ్చింది. ఇప్పుడు శివరామకృష్ణన్ కమిటీ నివేదికను అమలు చేయాలని కోర్టుకు వెళ్లారు. నిపుణుల కమిటిని నియమిస్తారు కానీ.. అవి నిర్బంధంగా అమలు చేయాలని ఎక్కడా ఉండదు. అది అందరికీ తెలిసిన విషయం. ఇలాంటి విషయాల్లో న్యాయవ్యవస్థ అసలు జోక్యం చేసుకోదు. కానీ ప్రభుత్వం శివరామకృ,ష్ణన్ కమిటీ నివేదికను అమలు చేయాలంటూ సుప్రీంకోర్టుకు వెళ్లింది.
శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టు అమలు చేయాలంటూ సుప్రీంకోర్టుకు వైసీపీ ప్రభుత్వం వెళ్లడం అంటే… పూర్తి స్థాయిలో నిరాశా , నిస్పృహలతో ఉన్నట్లు తేలిపోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టులో.. వారు జరిపిన ప్రజాభిప్రాయసేకరణలో అత్యధిక మంది గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. శివరామకృష్ణన్ కూడా.. మార్టూరు, వినుకొండ వద్ద రాజధానిని ప్రతిపాదించారు. అంటే రాజధానిగా అమరావతి వద్దు… ఎక్కడైనా పర్వాలేదన్న ఓ కుట్ర బుద్దితో .. న్యాయవ్యవస్థలను అడ్డం పెట్టుకుని వైసీపీ ఏదో విధంగా లిటిగేషన్లు పెట్టాలనే ప్రయత్నం చేస్తుందన్న వాదన వినిపిస్తోంది.