అనర్హతా వేటు పడకుండాకు ఒక్క రోజు అసెంబ్లీకి వెళ్లి ఇలా ప్రజెంట్ వేయించుకుని అలా డుమ్మా కొట్టి వచ్చేయాలనుకున్న జగన్ ప్లాన్ అమలు చేసినంత వరకూ బాగానే ఉంది కానీ.. తర్వాత అడ్డం తిరిగింది. గవర్నర్ ప్రసంగానికి హాజరవడం అనేది అసెంబ్లీకి హాజరయినట్లు కాదని టీడీపీ వర్గాలు రూల్ బుక్ ను బయటకు తీశాయి. ఏమీ తెలియని జగనే ఇలాంటి రాజకీయం చేయాలనుకుంటే అన్నీ తెలిసిన తాము ఇంకెంత రాజకీయం చేయాలని టీడీపీ వర్గాలు సెటైర్లు వేస్తున్నాయి.
అసెంబ్లీ సమావేశాలకు ఉదయం జగన్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే వెంటనే వాకౌట్ చేశారు. అసెంబ్లీకి హాజరు కాకపోతే అనర్హతా వేటు పడుతుందని స్పీకర్, డిప్యూటీ స్పీకర్ హెచ్చరిస్తున్న సమయంలో అరవై రోజుల నిబంధనను కంప్లీట్ చేయడానికి ఒక్క రోజు అసెంబ్లీకి వెళ్లాలనుకున్నారు. ఆ విధంగా వెళ్లారు కానీ.. అది కౌంట్ కావడం లేదని తేలడంతో వైసీపీ సభ్యులు డీలా పడిపోతున్నారు.
అసెంబ్లీకి వెళ్లేది లేదని పంతం పట్టిన జగన్ .. అనర్హతా వేటు నుంచి తప్పించుకునేందుకు పరువుపోయినా సరే ఓ రోజు ప్రజెంట్ వేయించుకున్నారు. అంటే తన వ్రతాన్ని చెడగొట్టుకున్నారు. పోనీ ఫలితం అయినా దక్కిందా అంటే అదీ లేదు. ఆయన హాజరీ పని చేయదని తేలడంతో ఇప్పుడు ఈ సెషన్ లాస్ట్ డేస్ తర్వాత ఆయనపై వేటు వేసే అవకాశం ఉంది. మిగిలిన ఎమ్మెల్యేలపైనా అనర్హతా వేటు వేస్తే .. వైసీపీ పరిస్థితి ఘోరంగా మారుతుంది.
అయితే తాము అసెంబ్లీకి హాజరయ్యామని అయినా అనర్హతా వేటు వేశారని కోర్టుల్లో న్యాయపోరాటం చేసే చాన్స్ జగన్ కు ఉంటుంది. అయితే స్పీకర్ నిర్ణయాలను కోర్టు ప్రశ్నించే అవకాశం చాలా తక్కువ.