వైసీపీ నేతల బాగోతాలను ఒక్కొక్కటిగా వెలికితీస్తూ వరుస ట్రీట్మెంట్లు ఇస్తోన్న కూటమి సర్కార్ తాజాగా లక్ష్మీపార్వతికి షాక్ ఇచ్చింది. వైఎస్ జగన్ హయాంలో నిబంధనలకు విరుద్దంగా లక్ష్మీపార్వతికి ఆంధ్రా యూనివర్సిటీ ‘ గౌరవ ఆచార్యులుగా ” ప్రత్యేకమైన హోదాను కట్టబెట్టింది. పీహెచ్ డీ విద్యార్థులకు గైడ్ గా నియమించింది.
దీనిపై విద్యార్ధి సంఘాలు నాడు వీసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.. మీరు ఏమాత్రం ఆందోళన చెందకండి..అన్నీ మేము చూసుకుంటామని విద్యార్థులకు వీసీ నచ్చజెప్పారు. అయితే, మొన్నటి ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చాక ఈ విషయం ప్రభుత్వం వద్దకు చేరింది. దీనిపై సర్కార్ సీరియస్ అయింది.
పీహెచ్ డీ విద్యార్థులకు గైడ్ గా వ్యవహరించాలంటే పీజీ విద్యార్థులకు కనీసం ఐదేళ్లపాటు బోధించిన అనుభవం ఉండాలి. కానీ లక్ష్మీపార్వతి వైసీపీ నేత అనే ఒకే ఒక్క కారణంతో నిబంధనలకు పాతరేసి ఆమెను ఏయూ గౌరవ ఆచార్యులుగా నియమించారు. ఈ విషయంపై తాజాగా ఆంధ్రా యూనివర్సిటీ కీలక ప్రకటన చేసింది.
Also Read : ధర్మాన.. రాజకీయాలకు దండం పెట్టబోతున్నారా?
గతంలో ఆమెకు కేటాయించిన ‘గౌరవ ఆచార్యురాలు’ హోదాను ఉపసంహరించుకున్నట్టు పేర్కొంది. ఈమేరకు రిజిస్ట్రార్ ఎన్.కిశోర్ బాబు ప్రకటన విడుదల చేశారు. అయితే, ఈ హోదాలో ఆమె కొనసాగినందుకు ఆమెకు ఇప్పటివరకు ఎలాంటి వేతనం చెల్లించలేదని స్పష్టం చేశారు.
గతంలో లక్ష్మీపార్వతి పర్యవేక్షణలో పరిశోధన చేసేందుకు చేరిన పీహెచ్ డీ విద్యార్థులకు.. ఇప్పుడు మరో ప్రొఫెసర్ ను గైడ్ గా నియమించనునట్లు వర్సిటీ రిజిస్ట్రార్ కిశోర్ బాబు వెల్లడించారు.