ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం అడ్డగోలుగా షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది. జూన్ లో ప్రొబేషన్ ఇచ్చి జూలై ఒకటో తేదీ నుంచి పర్మినెట్ అయిన ఉద్యోగికి వచ్చే జీతం ఇస్తామని ప్రకటించింది. అయితే ఇప్పుడు అందర్నీ పర్మినెంట్ చేయడం లేదు. రెండేళ్లకు పర్మినెంట్ చేస్తామని చెప్పి… మూడేళ్లకు కాస్త ముందుగా ఆ పని చేస్తున్న ప్రభుత్వం అందరికీ అలా చేయడం లేదు. పరీక్షలు పెట్టి ఫెయిలయ్యారని చెప్పి రెండొంతుల మందికి పర్మినెంట్ చేయడం లేదు. బహుశా… ఒక సామాజికవర్గం వారినే పర్మినెంట్ చేస్తారేమో కానీ.. యాభై వేల మందికి మాత్రమే పర్మినెంట్ చేయాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు. రూ. లక్షా 27వేల మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నారు.
కానీ అందరికీ పరీక్షలు పెట్టే ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. రెండేళ్లకు పర్మినెంట్ చేస్తామని రాసిచ్చారు. కానీ రెండేళ్ల తర్వాత పరీక్షల పేరుతో అందర్నీ వేధింపులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం అని సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు కూడా వదులుకుని వచ్చిన వారున్నారు. వారందరి జీవితాలు ఇప్పుడు రిస్క్‌లో పడిపోయాయి. ఇప్పుడు పర్మినెంట్ చేయకపోతే ఇంకెప్పుడూ చేయరని వారు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు ఉద్యోగ సంఘాల నేతలు కూడా నోరెత్తడం లేదు.
నిబంధనలకు విరుద్ధంగా పరీక్షలు పెట్టడమే కాదు.. ఇప్పుడు ఫెయిలయ్యారని ఆపేయడం ఏమిటని వాదిస్తున్నారు. కానీ ఉద్యోగ సంఘ నేతలు కూడా వారి గోడును పట్టించుకోవడం లేదు. అసలు ప్రొబేషన్ ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటే.. కొంది మందికి ఇచ్చి కొంత మందికి ఇవ్వకపోతే బాగోదు.. అందరికీ ఒకేసారి ఇవ్వడానికే జూలైలో ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. తీరా చూస్తే.. జూలైలోనూ.. సగం కన్నా తక్కువ మందికే ప్రొబేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది.