ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి హఠాత్తుగా ఓ ప్రకటన వచ్చింది. అదేమిటంటే సినిమాటోగ్రఫీ శాఖను పేర్ని నానికి అప్పగిస్తున్నట్లుగాఆ ప్రకటన సారాంశం. దీన్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటి వరకూ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని కాదా అని అని ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకూ సినిమా రంగానికి సంబంధించి సమీక్షలు.. అన్నీ ఆయనే చేస్తున్నారు. ప్రభుత్వం తరపున సినిమా వ్యవహారాలు చూసే మంత్రిగా ఆన్నీ పర్యటనలకు వెళ్తున్నారు. హైదరాబాద్లో ఎవరైనా సినీ ప్రముఖులు చనిపోతే ప్రభుత్వం తరపున ఆయనే నివాళులు అర్పిస్తున్నారు.
చివరికి ధియేటర్ యాజమాన్యాలతోనూ ఆయనే చర్చలు జరిపారు. మరి ఇవన్నీ ఏ హోదాతో జరిపారన్నది ఇప్పుడు అందరికీ డౌట్ వస్తోంది. ఇప్పటి వరకూ సినిమాటోగ్రఫీని ఎవరికీ ఇవ్వలేదని సీఎం వద్దే ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే సమాచార , ప్రసారశాఖ మంత్రిగా ఉన్న పేర్ని నానికి ఆ శాఖ బాధ్యతలు అనధికారింగా ఇచ్చారు. అంటే… అధికారికంగా మంత్రులు చేయడానికి ఏమీ ఉండదు.
ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టి రావాలి. కానీ సినిమాటోగ్రఫీ విషయంలోఇటీవల జరిగిన రాద్ధాంతం వల్ల పేర్ని నాని పదే పదే తెర ముందుకు వచ్చారు. దీంతో ఆయనే సినిమాటోగ్రఫీమంత్రి అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేదని.. ఆయనకు కొత్తగా ఆ శాఖ ఇస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే ఏపీ ప్రభుత్వంలో ఇవన్నీ సహజమేనని.. తమతమ శాఖలేవో ఆయా మంత్రులేమర్చిపోయి ఉంటారన్న సెటైర్లు సామాన్య జనం నుంచి వస్తున్నాయి.