ఏపీ ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్ అధికారులకు ప్రమోషన్లు కల్పించింది. ఎంటీ కృష్ణబాబు, అనిల్ కుమార్ సింఘాల్ , గోపాలకృష్ణ ద్వివేదీలకు పదోన్నతలు కల్పించింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా వారి క్యాడర్‌ను మార్చారు. ఈ హోదాతోనే ప్రస్తుతం ఉన్న స్థానాల్లో పని చేస్తారని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం సింఘాల్ రాజ్ భవన్ లో పని చేస్తూండగా మిగతా ఇద్దరు ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్నారు. అంతే కాదు ప్రభుత్వం ఏం చెప్పినా నిబంధనలు కూడా చూసుకోకుండా.. పాటించడమే ధ్యేయంగా ఉంటారన్న ప్రచారం ఉంది.
అనేక కోర్టు ధిక్కరణ కేసుల్లో వీరు ఎన్ని సార్లు జైలు చుట్టూ తిరిగాలో లెక్కలేయడం కష్టం. గత వారమే ఎంటీ కృష్ణబాబుకు హైకోర్టు జైలు శిక్ష విధించింది. శిక్ష అనుభవిస్తారో లేకపోతే.. డివిజన్ బెంచ్ వద్ద అప్పీల్ చేసుకుని బయటపడతారో తెలియదు కానీ.. ఆయనకు శిక్ష అయితే కోర్టు విధించింది. గతంలో అనిల్ కుమార్ సింఘాల్, గోపాలకృష్ణ ద్వివేదీలూ హైకోర్టు ఆగ్రహానికి గురయ్యారు. అయితే డివిజన్ బెంచ్‌కు వెళ్లి ఎలాగోలా బయట పడ్డారు. కానీ వారి తీరు మాత్రం .. కోర్టు రికార్డుల్లో అలాగే ఉంది. ధిక్కారకులుగానే ఉండిపోయారు .
అయితే ఎన్ని నిబంధనలు ఉల్లంఘించిన ప్రభుత్వం తమను కాపాడుతోందని..అలాగే ప్రమోషన్లు కూడా ఇస్తుంది కాబట్టి ఇక తాము ఆలోచించాల్సిన అవసరం ఏందున్నట్లుగా ఈ అధికారుల తీరు ఉంది. అందుకే.. పెద్దగా పట్టించుకోవడం లేదు. నిజానికి ఈ ముగ్గురు అధికారులు ఎన్ని సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారో రికార్డుల పరంగా చూస్తే ఎలాంటి ప్రమోషన్ ఇవ్వకూడదు. కానీ తమ కోసమే పాల్పడ్డారు కాబట్టి ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రమోషన్లు ఇస్తోంది.