ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల మొత్తం ఓవర్ డ్రాఫ్ట్ లోనే ఉందని ఆర్బీఐ ప్రభుత్వానికి లేఖ రాసింది. మూడు నెలల కాలంలో 36 రోజులకు మించి ఓవర్ డ్రాఫ్ట్ లో ఉంటే.. దివాలా తీసినట్లే లెక్క. ఇప్పటికే ఆర్బీఐ నుంచి రెండు సార్లు హెచ్చరిక లేఖలు వచ్చాయి. మొదటి సారి హెచ్చరిక లేఖ వచ్చినప్పుడు సీఎం జగన్ కాకినాడలో పోర్టు స్థలాలను రాత్రికి రాత్రి తాకట్టు పెట్టి.. రూ. రెండు వేల మూడు వందల కోట్లు అప్పు తెచ్చి.. ఆర్బీఐకి కట్టేశారు. అయితే రెండు రోజుల తర్వతా మళ్లీ ఆ మొత్తం ఓడీ కింద తీసుకున్నారు.
ఇంత ఘోరమైన పరిస్థితుల్లో దాదాపుగా రూ. వెయ్యి కోట్ల వరకూ బైజూస్‌కు బిల్లులు చెల్లించి ట్యాబ్‌లు తీసుకొచ్చినట్లుగా చెబుతోంది. ఈ రోజు నుంచి వారం రోజుల పాటు పిల్లలకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తున్నారు. ఇందు కోసం రూ. 768 కోట్లు ఖర్చు చేస్తున్నట్లుగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇక ఫుల్ పేజీ ప్రకటనలు.. ప్రచారఆర్భాటాల గురించి చెప్పాల్సిన పని లేదు. అయితే ఇదంతా పిల్లల కోసం కాదని..బైజూస్ ను గట్టున పడేయడానికన్నా విమర్శలు వస్తున్నాయి. ఆదాయం దారుణంగా పడిపోయిన బైజూస్ కు.. ఏపీ ప్రభుత్వం చెల్లించిన సొమ్మే ఈ ఏడాది టర్నోవర్‌లో కీలకంగా మారనుంది.
ఈ త్రైమాసికంగా ఏపీ ప్రభుత్వం చెల్లించిన సొమ్ముతో తాము మెరుగైన స్థితిలో ఉన్నామని బైజూస్ ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉంది. గత ఏడాది రెండున్నర వేల కోట్ల అమ్మకాలు..నాలుగున్నర వేల కోట్ల నష్టాలు బైజూస్ చూాపించింది. ఈ ఏడాది ఇంత వరకూ ఎలాంటి అకౌంట్స్ ప్రకటించలేదు. ఆ సంస్తకు పూర్తి స్థాయిలో ఖాతాదారులు తగ్గిపోయారు. క్వాలిటీ ఆఫ్ కంటెంట్ పైనా తీవ్ర అభియోగాలున్నాయి. విద్యార్థులను మోసం చేస్తున్నారని అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఏపీ ప్రభుత్వం బైజూస్ కు కనీసం వేయి కోట్లు అప్పచెప్పడం ఆశ్చర్యంగా మారింది.
బైజూస్ అనేది ఈ కంటెంట్. దాని వల్ల ఏ ఉపయోగం లేదని.. విద్యా నిపుణులు చెబుతున్నారు. ఏపీలో టీచర్లు.. ప్రత్యేకమైన సిలబస్ ఉండగా.. ఈ బైజూస్ అవసరం అసలు లేదని చెబుతూంటారు. కానీ ప్రభుత్వం మాత్రం… అప్పులు చేసి. .. మరీ బైజూస్ ను పాఠశాలల్లోకి చొప్పించేసింది.