ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ సర్కార్.. భగవద్గీతగా భావిస్తున్న రెండు పేజీల మేనిఫెస్టోలో… ఒక్కొక్కదాన్ని నెరవేరుస్తున్నామని చెబుతోంది కానీ… ఒక్కటీ .. అమల్లోకి రాలే్దు. సన్నబియ్యం అన్నారు.. చివరికి.. అలా అనలేదని..నాణ్యమైన బియ్యం అన్నామన్నారు. అదైనా ఇస్తున్నారంటే.. వచ్చే ఏడాది మార్చి నుంచి అంటున్నారు. పెన్షన్లు రూ. మూడు నుంచి రూ. 2,250కి పడిపోయాయి. ఇలా చెప్పుకుటూ పోతే.. ఇప్పటిదాకా అమల్లోకి వచ్చిన అతి కొద్ది పథకాల్లోనూ కోత పడింది. కొత్తగా రైతుభరోసాను అమలు చేసే సమయం దగ్గరపడింది. దీంట్లోనూ కోతలు పెట్టేందుకు ప్రభుత్వం మార్గాలు వెదుకుతోంది.
ఒకే సారి రూ. 12500 ఇవ్వడం కష్టమేనా…?
రైతు భరోసా కింద రూ. పన్నెండు వేల ఐదువందల రూపాయలు ఒకే సారి అందిస్తామని ఎన్నికల ప్రచారంలోనూ.. పాదయాత్రలోనూ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రతీ మేలో ఇస్తామని ప్రకటించారు. కానీ.. మే నెలాఖరురోజున… జగన్ ప్రమాణస్వీకారం చేశారు. దాంతో… అక్టోబర్లో ఇవ్వాలని నిర్ణయించారు. ఇదే కార్యక్రమానికి ప్రధానిని పిలవడం ద్వారా జాతీయ స్థాయిలో ఈ పథకానికి ఫోకస్ వచ్చేలా చూడాలని భావించారు. ప్రధానిని ఆహ్వానించారు. వస్తారా.. రారా.. అన్నదానిపై క్లారిటీ లేదు. రూ. 12500 లబ్దిదారులకు ఒకేసారి ప్రభుత్వం ఎలా ఇస్తుందనే సందేహం ప్రారంభమయింది. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ నుంచి రైతుకు పంట పెట్టుబడి సాయాన్ని పిఎం కిసాన్ పేరిట మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను నేరుగా రైతు ఖాతాల్లోకి వేస్తోంది. ఈ పథకాన్ని అనుసంధానిస్తూ వైఎస్సార్ రైతు భరోసాను అమలు చేయాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అంటే.. ప్రభుత్వం రూ. 6,500 మాత్రమే ఇస్తుంది. కేంద్ర పథకం అమలు తీరు ఒక విధంగా.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోయే పథకం తీరు మరో విధంగా ఉండడంతో రెండింటినీ అనుసంధానించుకుంటూ పథకాన్ని అమలు చేయాల్సిఉంది. అందుకే రైతు ఖాతాలకు నేరుగా ఇచ్చిన హామీ మేరకు 12500 రూపాయలు ఎలా జమ చేస్తారనేది సవాలుగా మారింది.
12 లక్షల మంది రైతుల్ని లబ్దిదారుల జాబితా నుంచి తీసేస్తారా..?
కౌలు రైతులకు కేంద్ర సర్కార్ నుంచి ఎటువంటి సాయం చేయడం లేదు. ప్రభుత్వం ఇచ్చే రూ. 12500 రూపాయల మొత్తం నేరుగా వారి ఖాతాలకు వేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 43.2 లక్షల మంది రైతులు ఉన్నట్లు కేంద్రానికి గతంలో నివేదిక అందించింది. దీని ప్రకారం.. పీఎం కిసాన్ యోజన పథకం కింద మొదటి విడతలో 42.5లక్షల మందికి రెండు వేల రూపాయలను నేరుగా వారి ఖాతాల్లోకి వేసింది. అయితే రెండో విడతకు వచ్చేసరికి 42.5 లక్షల నుంచి 33.21 లక్షలకు వివిధ నిబంధనల ప్రకారం తగ్గించింది. ఇరప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎంత మందికి ఇస్తుందనేది.. చర్చనీయాంశంగా మారింది.
తేడా వస్తే రైతుల్లో తీవ్ర వ్యతిరేకత..!
ఎన్నికల మ్యానిఫెస్టోను భగవద్గీతగా , ఖురాన్, బైబిల్ గా భావిస్తామని పదేపదే చెపుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి రైతు భరోసా పధకం అమలులోలబ్దిదారులను ఫిల్టర్ చేస్తే.. తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే.. రాష్ట్ర ప్రభుత్వమే రూ. 12500 ఇస్తుందని అనుకున్న రైతులకు… కేంద్రం ఇచ్చేదాంతో కలిపి అని తేలడంతో అసంతృప్తిగా ఉన్నారు. అయినా మొత్తం ఒకే సారి ఇస్తారని ఆశ పడుతున్నారు. కానీ అలా కూడా ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో.. టెన్షన్ పడుతున్నారు.