జల్సా సినిమాలో షర్ట్ సీన్‌ను ఏపీ ప్రభుత్వం రిపీట్ చేస్తోంది. అక్కడ షర్ట్ అయితే ఇక్కడ మద్యం. ఏ అవసరం వచ్చినా సీఎం జగన్ మద్యం ఆదాయంపై అప్పులు తీసుకు రాండి అని ఆదేశాలు ఇస్తున్నారు. గతంలో కార్పొరేషన్ పేరుతో మద్యం ఆదాయాన్ని మళ్లించి రూ. పాతిక వేల కోట్లు తెచ్చేసిన సర్కార్.. తర్వాత బాండ్ల బాటలో అప్పులు తెస్తోంది. తమకు ఏటా రూ. ఇరవై వేల కోట్ల మద్యం ఆదాయం వస్తోందని.. చూపించి బాండ్లు వేలం వేసి అప్పులు తెలుస్తోంది. దాదాపుగా పది శాతం వడ్డీ కడుతోంది. ఎప్పటికి రూ. ఎనిమిది వేల కోట్ల తెచ్చేసింది. ఇప్పుడు మరో పాతిక వేల కోట్లు తేవాలని డిసైడయినట్లుగా కనిపిస్తోంది.
అవసరాలు పెరిగిపోతూండటం… అప్పులకు వడ్డీలు.. ఉద్యోగులకు జీతాలు.. పథకాలకు నగదు బదిలీ … సలహాదారులకు జీతాలు ఇలా అన్నీ చూసుకుంటే ఆదాయం.. అప్పులు కూడా సరిపోవడం లేదు. దీంతో వేల కోట్లు కొత్త కొత్తగా అప్పులు చేయాల్సి వస్తోంది. ఇతర మార్గాలన్నీ మూసుకుపోతే చివరికి ప్రభుత్వానికి మద్యం మాత్రమే కనిపిస్తోంది. అందుకే జగన్ డబ్బుల్లేవంటే మద్యం ఆదాయం తాకట్టు పెట్టమని చెబుతున్నారు. ఈ కారణంగా మరోసారి పాతిక వేల కోట్లకు బాండ్లు వేసి అప్పు తేవాలని నిర్ణయించారు.
ఈ ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తయి ఉంటుందని.. భావిస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం దాదాపుగా ఎలాంటి సమాచారం బయటకు రానివ్వడం లేదు. తప్పనిసరిగా తెలియాల్సిన సందర్భంలో తెలుస్తున్నాయి. అలాంటి సందర్భంలోనూ సైలెంట్‌గా ఉంటోంది తప్ప వివరణ ఇవ్వడం లేదు. ఈ ప్రకారం చూసినా మందు బాబులను అదే పనిగా తాకట్టు పెట్టడం మాత్రం నిరంతర ప్రక్రియగా కొనసాగే అవకాశం ఉంది.