ఏపీ ప్రభుత్వం కోర్టులో ఒకటి వాదించి.. బయట మరో రకంగా నిర్ణయం తీసుకుంది. ఆనందయ్య మందుతో బ్లాక్ ఫంగస్ వస్తుందని.. ఆనందయ్య మందు బాధితులు వంద మందికిపైగా నెల్లూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారని వాదించిన ప్రభుత్వం.. ఆ తర్వాత కాసేపటికే మందు పంపిణీకి అనుమతి ఇచ్చింది. కంట్లో వేసే పసరు మందుకు మినహా మిగతా మందులకు అనుమతి ఇచ్చింది. ఆ పసరు మందుకు సంబంధించిన నివేదికలు రావడానికి ఇంకా రెండు, మూడువారాల సమయం పడుతుందని తేల్చారు. ఇప్పటి వరకూ వివిధ అధ్యయన సంస్థలు చేసిన పరిశోధనల్లో ఆనందయ్య మందు వల్ల కరోనా తగ్గుతుందని తేలలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే హానికరం కాదని తేలడంతో మందు పంపిణీకి అనుమతి ఇస్తున్నట్లుగా తెలిపారు.
అంతకు ముందు ఆనందయ్యకు ముందు అనుమతిపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు జరిగాయి. గత విచారణలో… ఆనందయ్య మందుపై ఆయుష్ తో పాటు వివిధ రకాల శాఖల పరిశోధనల పత్రాలు సమర్పిస్తమని ప్రభుత్వం చెప్పింది. ఆ పత్రాలగురించి చెప్పకుండా… ఆ మమందులపై కంప్లైంట్స్ చెప్పడంతో ప్రభుత్వ న్యాయవాదిపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రెండు వారాల నుంచి ఆనందయ్య పోలీసుల అదుపులోనే ఉన్నారు. నిజానికి పోలీసుల అదుపులో ఉన్నారో.. వైసీపీ నేతల అదుపులో ఉన్నారో ఎవరికీ తెలియదు. ఆయనతో పెద్ద ఎత్తున కరోనా మందు తయారు చేయించి.. ఇతర చోట్లకు తరలిస్తున్న విషయం మాత్రం స్పష్టమయింది.
ఈ క్రమంలో కేంద్రం నుంచి అనుమతులు రావాలని.. ఆ తర్వాతే పంపిణీ చేస్తారన్న ప్రచారాన్ని చేస్తూవస్తున్నారు. మరో వైపు… ఆనందయ్య మందుకు ఫేమస్ తెచ్చి పెట్టిన.. రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య.. జీజీహెచ్లో చికిత్స పొందుతూ చనిపోయారు. దీన్ని ఆనందయ్య మందుకు వ్యతిరేకంగా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. హైకోర్టులో ఎలాంటి వాదన వినిపించినా… చివరికి ప్రభుత్వం .. సోషల్ మీడియాలో జరుగుతున్న పాజిటివ్ ప్రచారం… ప్రజల్లో మందుపై ఉన్న నమ్మకంతో … ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వక తప్పలేదు.