విశాఖ రాత మార్చే ఒప్పందాన్ని ఏపీ ప్రభుత్వం ఇవాళ చేసుకుంది. గూగుల్ తన కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించబోతోంది. ఆ సంస్థ ప్రతినిధులు సీఎం చంద్రబాబుతో సమావేశమై చర్చలు జరిపారు. విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు కూడా ఒప్పందం చేసుకున్నారు. గూగుల్ ఎలాంటి ఆఫీస్ ను ప్రారంభించబోతుందో చెప్పలేదు కానీ. విశ్వసనీయ సమాచారం సమాచారం గూగుల్ క్లౌడ్ క్యాంపస్ ను ప్రారంభించనున్నట్లుగా అధికారవర్గాలు చెబుతుననాయి.
కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు ఈ ఒప్పందం గురించి మాట్లాడారు. గూగుల్ ఆఫీస్ యాక్టివిటీస్ ప్రారంభమైతే విశాఖ చరిత్ర మారిపోతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అందుకే నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటే కచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. ప్రస్తుతం కాలంలో హార్డ్ వర్క్‌తో సాధ్యం కాని పనులు స్మార్ట్ వర్క్‌తో పూర్తి అవుతున్నాయని చెప్పుకొచ్చారు. లోకేష్ కృషి వల్లే విశాఖలో గూగుల్ ఏర్పాటుకు ఎంఓయూ జరిగిందని గూగుల్ విశాఖపట్నంకి వస్తే గేమ్ చేంజర్ అవుతుందన్నారు. గూగుల్‌తో ఒప్పందం ద్వారా 20 లక్షల మందికి ఉపాధి కల్పించేలా కృషి చేస్తామన్నారు.
ఇప్పటికే దేశీయ సాఫ్ట్ వేర్ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ విశాఖ లో క్యాంపస్ లు నిర్వహిస్తున్నాయి. గూగుల్ భారీ క్యాంపస్ ఏర్పాటు చేస్తే ఇక సాఫ్ట్ వేర్‌కు కేంద్రంగా విశాఖ మారుతుందన్న అభిప్రాయం ఏర్పడుతోంది.