“అమరావతికి ప్రపంచబ్యాంక్ రుణం ఇస్తామంటోంది… మీ స్పందన తెలియచేయండి..” అని కేంద్రం వరుసగా లేఖలు రాసింది. వచ్చిన లేఖలన్నింటినీ… ఏపీ సర్కార్. చెత్తబుట్టలో పడేసింది. కనీసం.. రిప్లయ్ ఇద్దమన్న ఆలోచన కూడా చేయలేదు.
“పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్లు రద్దు చేయవద్దు.. అవినీతి ఉంటే ఆధారాలు ఇవ్వండి..” .. అని .. కేంద్రం… లేఖ పంపిన ప్రతీ సారి.. కాస్త ఘాటుగా మార్చి పంపుతూనే ఉంది. కానీ.. దేన్నీ.. ఏపీ సర్కార్ పట్టించుకోలేదు.
“పోలవరంపై రేమండ్ పీటర్ కమిటీ నివేదికలో పేర్కొన్న అంశాలపై వివరణ ఇవ్వండి..” అని మరోసారి అదే కేంద్రం.. పదే పదే లేఖలు రాసింది. కానీ … ఏపీ సర్కార్ మాత్రం.. ఏదో మార్కెటింగ్ … లెటర్స్ అన్నంత లైట్ తీసుకుంది.
కేంద్ర లేఖలంటే ఏపీ సర్కార్కు చిన్న చూపా..?
అత్యంత కీలకమైన విషయాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న లేఖలు.. ఇతర వివరాల కోసం.. చేస్తున్న సంప్రదింపుల్ని ఏపీ ప్రభుత్వం పూర్తిగా ఎవాయిడ్ చేస్తోంది. అసలు కేంద్రాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఏమిటన్నట్లుగా.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఉండటం.. ఢిల్లీ వర్గాలను సైతం విస్మయపరుస్తోంది. ఇంత వరకూ.. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా… ఇంకా చెప్పాలంటే… కేంద్రంతో తీవ్రంగా విబేధించే… సర్కార్ ఉన్న బెంగాల్ రాష్ట్రం కూడా.. కేంద్రం నుంచి వచ్చే ప్రతీ లేఖకూ.. సమాధానం ఇస్తుంది. సమాఖ్య వ్యవస్థలో.. ఇది అత్యవసరం కూడా. ఎందుకంటే… అవి రాజకీయ పరంగా.. వచ్చే లేఖలు కాదు. పరిపాలనా పరంగా.. వచ్చే లేఖలు. వాటికి..సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది.
వివరాలు చెప్పకుండా ఎందుకు నిర్లక్ష్యం..?
కేంద్రం అడుగుతున్న వివరాలను… వెల్లడించకుండా.. ఉండటానికి ఏపీ సర్కార్ కు కారణాలు లేవు. అవేమీ.. పరిపూర్ణంగా.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వ్యవహారాలు కావు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో కేంద్ర ప్రాజెక్టు. ప్రతీ రూపాయి కేంద్రమే ఇస్తోంది. నిర్మాణ నిర్వహణ మాత్రం ఏపీ సర్కార్ ది. అలాంటప్పుడు… ఎలాంటి డౌట్ వచ్చినా.. తీర్చాల్సిన బాధ్యత ఏపీ సర్కార్ పై ఉంది. కానీ ఏపీ సర్కార్ .. కేంద్రం గొంతు చించుకుంటున్నా.. మౌనం పాటిస్తోంది. పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్ల విషయంలో జగన్ వ్యవహరించిన తీరు.. కేంద్రాన్ని ఎంత ఆగ్రహం తెప్పించిందో.. కేంద్రమంత్రి ఆర్కేసింగ్ మాటలతోనే తేలిపోయింది. ఇక అమరావతి విషయంలో ఏపీని బతిమాలాడాల్సిన అవసరం ఏముందనుకున్నారో కానీ… కేంద్రం.. రుణం వద్దని తేల్చేసింది. అయినా ఏపీ సర్కారుకు చీమకుట్టినట్లుగా కూడా లేదు.
మోడీ, షా ఆశీస్సులున్నాయనే ధైర్యమా..?
మోడీ, అమిత్ షాలకు అన్నీ చెప్పి చేస్తున్నామంటున్న విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి …ఆ ధైర్యంతోనే.. కేంద్ర మంత్రుల వద్ద నుండి వస్తున్న లేఖలకు సమాధానం ఇవ్వడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అయితే.. కేంద్రప్రభుత్వం అంటే.. మంత్రులు కూడా. మంత్రులు చెప్పిందే.. అధికారికం. అలా కాకండా.. పెద్దల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి.. తాము .. లెక్క చేయకపోయినా పర్వాలేదన్నట్లుగా… ఏపీ ప్రభుత్వ పెద్దల తీరు ఉంది. చివరికి ఈ పరిస్థితి ఏపీ సర్కార్ ను ఇబ్బందుల్లో పడేస్తుంది తప్ప.. సున్నితంగా సమస్యను పరిష్కంచే అవకాశాలు మాత్రం ఉండవు. ఎందుకంటే.. తమను పట్టించుకోవద్దని.. పూచికపుల్లలా తీసి పక్కన పడేయమని.. ఎవరూ ఇతురులకు చెప్పరు. కేంద్రం అసలు చెప్పదు.