ఆంధ్రప్రదేశ్‌లో.. బయటకు కనిపించని.. పెద్దగా ప్రచారం దక్కని ఓ పథకం ప్రారంభమైంది. అదే శిక్ష పడిన ఖైదీలకు పెరోల్స్ ఇవ్వడం. గత నలభై ఐదు రోజుల్లోనే… ఏపీలోని సెంట్రల్ జైళ్ల నుంచి 50 మంది విడుదలయ్యారు. వీరందరూ శిక్ష పూర్తి చేసుకున్న వారో.. బెయిల్ పొందిన వారో కాదు. నేరం రుజువై … కోర్టు వేసిన కఠిన కారాగారవాసాన్ని అనుభవిస్తున్నవారు. వీరందరికీ కోర్టు స్వేచ్ఛావాయువులు పీల్చుకోమని.. చాన్స్ ఇవ్వలేదు. ప్రభుత్వమే ఇచ్చింది. 45 రోజుల్లో ఇలా 50 మందిని బయటకు పంపేసింది. ఇందులో 13 మంది ఒకే సామాజికవర్గానికి చెందిన వారు. చాలా కొద్ది సమయంలోనే.. ఇంత మందకి ఒకే సారి పెరోల్ ఇవ్వడం అనేది… జైళ్ల శాఖ వర్గాలనే ఆశ్చర్య పరుస్తోంది.
నిబంధనలకు విరుద్ధంగా శిక్షపడిన ఖైదీలకు పెరోల్స్..!
కరుడుగట్టిన నేరస్తులు.. కఠినమైన శిక్షలు పడి.. సెంట్రల్ జైళ్లలో మగ్గుతున్న వారికి… అత్యవసర పరిస్థితుల్లో.. అంటే… కుటుంబసభ్యుల మరణాలులాంటివి చోటు చేసుకున్నప్పుడు.. మానవతా దృక్పథంతో ప్రభుత్వం చాలా స్వల్ప కాలం పాటు ఇచ్చే వెసులుబాటు పెరోల్. గరిష్టంగా 15 రోజులు మాత్రమే ఇవ్వడానికి అవకాశం ఉందని.. జైళ్ల శాఖ వెబ్సైట్లో పేర్కొంది. ఇలా పేరోల్ పొందడానికి కూడా.. కొన్ని కఠినమైన నిబంధనలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం ప్రత్యేకంగా జీవోలు విడుదల చేసి మరీ..ఖైదీల్ని రిలీజ్ చేస్తున్న వ్యవహారంలో.. ఈ నిబంధనలు ఏమీ పాటించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గరిష్టంగా.. పెరోల్ 15 రోజుల వరకే ఇవ్వడానికి అవకాశం ఉందని.. జైళ్ల శాఖ నిబంధనలు చెబుతున్నా.. ప్రభుత్వం మాత్రం 30 రోజుల పాటు పెరోల్ ఇస్తూ జీవోలు జారీ చేసింది.
అధికార పార్టీ నేతల అండతోనే పెరోల్స్..!
ఇప్పుడు జైళ్ల నుంచి పెరోల్ పై రిలీజవుతున్న వారంతా… అధికార పార్టీ నేతలకు … సన్నిహితులే. అధికార పార్టీ అండ లేకుండా.. శిక్ష పడిన ఖైదీలు… పెరోల్ పొందడం.. దాని కోసం ప్రత్యేకంగా.. కారణాలు లేకుండా జీవోలు సైతం జారీ చేయించుకోవడం అంటే… సాధ్యమయ్యే పని కాదు. ఇలా బయటకు వచ్చిన వారు.. మళ్లీ.. తమ శిక్ష అనుభవించడానికి.. జైలుకెళ్తారని… ఊహించడం కూడా కష్టమే. అధికారం ఉన్నంత వరకూ.. తాము బయటకు తీసుకొచ్చిన వ్యక్తుల్ని.. బయట ఉంచడానికే వైసీపీ నేతలు ప్రయత్నిస్తారు. అందుకే.. ప్రభుత్వం తీరుపై విమర్శలు వస్తున్నాయి.
పెరోల్ తీసుకుని పరారైతే ఎవరిది బాధ్యత..?
మరో వైపు వీరంతా కరుడుగట్టిన నేరస్తులు, హత్యల్లాంటి.. తీవ్రమైన నేరాలతో జైలు శిక్ష పడిన వారు. వారు ఒక సారి బయటకు వెళ్తే మళ్లీ తిరిగి వస్తారన్న నమ్మకం లేదు. గతంలో పలువురు ఇలా పెరోల్‌పై వచ్చి పరారైన రికార్డులు ఉన్నాయి. సీఎం వైఎస్ జగన్ కుటుంబానికి సన్నిహితుడిగా పేరొందిన… ఎర్రచందనం స్మగ్లర్ల గంగిరెడ్డి కూడా… ఒక కేసులో శిక్ష అనుభవిస్తూ… పెరోల్ పై బయటకు వచ్చారు. పెరోల్‌పై ఉంటూనే 2014లో టీడీపీ గెలవగానే పరారయ్యాడు. ఇలాంటి వారు చాలా మంది ఉన్నారని.. జైళ్ల శాఖ వర్గాలు చెబుతూ ఉంటాయి. ఇలా పెరోల్స్ మీద బయటకు వచ్చిన వారు .. ప్రజాభద్రతకు భంగం కలిగించరని గ్యారంటీ ఏముంది..?
Andhra Pradesh Government has released 50 convicted criminals on Parole in last 45 days
AP Government records show a pattern : 13 of them belong to one particular caste ! A Probe is necessary ? @HMOIndia @sardesairajdeep @ndtv @republic @BJP4India @AmitShahOffice pic.twitter.com/fjBwZAhMwW
— Telugu360 (@Telugu360) September 3, 2019