ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు అంటే ప్రత్యేక గౌరవం ఉంటుంది. ఈ గౌరవం ప్రాణం నిలిపిన వారి కన్నా పొందేందుకు అర్హులు ఎవరూ ఉండరు. అందకే ఏపీ ప్రభుత్వం వినూత్నమైన ఆలోచన చేసింది. అవయవ దాతల అంతిమ సంస్కారాలు… ఇకపై ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రత్యేకంగా జీవో జారీ చేశారు.
చనిపోయిన వారు.. బ్రెయిన్ డెడ్ అయిన వారి అవయవాలను అవసరార్ధులకు అమర్చడం ద్వారా . వారికి పునర్జన్మను ఇచ్చే జీవన్‌దాన్ కార్యక్రమంలో భాగంగా అవయవ దాతల అంతిమ సంస్కారాలను ప్రభుత్వం నిర్వహించనుంది. RDO స్థాయికి తక్కువ కాని అధికారుల నేతృత్వంలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు అవసరమైన నియమావళిని పేర్కొంటూ ఏపి ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చింది.
Also Read : మంగళగిరి అభివృద్ధిపై మంత్రి లోకేష్ స్పెషల్ ఫోకస్
అవయవ దానం వల్ల కొన్ని వందల మందికి పునర్జన్మ ప్రసాదించవచ్చని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. యాక్సిడెంట్లు, బ్రెయిన్ డెడ్ అయిన వారి కుటుంబసభ్యులు ఇటీవలి కాలంలో అవయవదానం చేసేందుకు అంగీకరిస్తున్నారు. అయితే సహజంగా చనిపోయిన వారి గురించి పెద్దగా సమాచారం రావడం లేదు. జీవన్ దాన్ లో నమోదు చేసుకున్న వారు చనిపోయిన తరవాత తమ అవయవాలను ఇవ్వడానికి అంగీకరించినట్లవుతుంది. ఇలా చనిపోయిన తర్వాత కూడా కొంత మందికి ప్రాణదానం చేస్తున్న వారికి గౌరవం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించి ఈ ఉత్తర్వులు జారీ చేిసంది.