ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని వర్గాల వారిని అడ్డగోలుగా మోసం చేసింది. అన్ని ప్రభుత్వాలు ఇచ్చే పథకాలు అయినా రేషన్, సామాజిక పెన్షన్లు.. ఇతర సంక్షేమ పథకాలనే అందరి ఖాతాలో చూపింంచి…. మోసం చేస్తోంది. తాజాగా మాదిగ వర్గం తమను ప్రభుత్వం మోసం చేసిందని తమ నిధులన్నీ కాజేశారని ఆరోపిస్తున్నారు. దీనిపై టీడీపీ సమావేశం పెట్టి తీవ్రమైన ఆరోపణలు చేయడంతో ఏపీ ఫ్యాక్ట్ చెక్ స్పందించి ఓ జాబితా విడుదల చేసింది. అందులో.. మాదిల కోసం ఉద్దేశించిన పథకాలే లేవు.
అందరికీ ఇచ్చే సామాజిక పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, , సున్నావడ్డీ, ఆసరా,, ఫీజు రీఎంబర్స్ మెంట్ వంటి పథకాల్లో దళితలుకు రూ. ప దహారు వేల కోట్లు ఇచ్చామని జాబితా రిలీజ్ చేశారు. నిజానికి వాటిలో చాలా ఫథకాలు గత ప్రభుత్వంలో ఉన్నాయి. వాటికి పేరు మార్చారు. పైగా అవి అందరికీ ఇచ్చేవి. దళిత వర్గాలకు ప్రత్యేకంగా నిధుల కేటాయింపు ఉంటుంది.సబ్ ప్లాన్ ఉంటుంది. ఆ సబ్ ప్లాన్ ప్రకారం దళితులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి వారి అభివృద్ధికి పాటుపడాలి. కానీ ఇక్కడ అందరికీ ఇచ్చే పథకాలకు లెక్కలేసి.. మాదిగలకు ఇంత మేలు చేశామని అతి తెలివి ప్రదర్శించింది ఫ్యాక్ట్ చెక్.
గతంలో ఏ ప్రభుత్వం అయినా అందరికీ ఇచ్చే పథకాలను ఇలా కులాల వారిగా విడగొట్టి.. మీకింత చేశామని చెప్పేది కాదు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం మాత్రం అదే చేస్తోంది. మిగతా ఇవ్వాల్సిన పథకాలన్నీ ఆపేసి.. బడుగు , బలహీనవర్గాల్ని మోసం చేస్తోంది. దాన్ని కూడా అడ్డగోలుగా సమర్థించుకుంటోంది. ఫ్యాక్ట్ చెక్ ఇప్పుడు అసుల వాస్తవాన్ని పరోక్షంగా అయినా బయట పెట్టింది. ఇక దళిత వర్గాలే నిర్ణయంతీసుకోవాల్సి ఉంది.