జగన్ రెడ్డి ప్రభుత్వం రైతులపై స్మార్ట్ మీటర్ల గుదిబండను పెట్టింది . అప్పు కోసం రైతుల మెడకు స్మార్ట్ మీటర్ల ఉరి పెట్టారని తెలంగాణలో హరీష్ రావు, కేసీఆర్ పలుమార్లు బహిరంగసభల్లో చెప్పారు. తాము అలాంటి పనులు చేయబోమన్నారు. తమకు రైతుల శ్రేయస్సే ముఖ్యమన్నారు. కానీ జగన్ మాత్రం పట్టించుకోలేదు. రైతులపై స్మార్ట్ మీవల్ల బండను అలాగే ఉంచారు. అయితే కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆ స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని రద్దు చేసేసింది. వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్ల బెడద లేకుండా చేసింది.
జగన్ రెడ్డి అప్పు కోసం వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతామని.. నగదు బదిలీ చేస్తామని నిర్ణయం తీసుకున్నారు. అప్పులు తెచ్చుకున్నారు. అన్నీ ఖర్చు పెట్టేశారు. అయితే తర్వాత కేంద్రం కొన్ని రూల్స్ మార్చింది. ఖచ్చితంగా స్మార్ట్ మీటర్లు వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే అప్పటికే స్మార్ట్ మీటర్లలో స్మార్ట్ గా దోపిడీ చేసేందుకు తన బినామీ కంపెనీగా పేరున్న షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు జగన్ కాంట్రాక్టు ఇచ్చేశారు. నిర్వహణ పేరుతో పెద్ద ఎత్తున దోపిడీకి ప్లాన్ చేశారు. ఈ విషయాలను గుర్తించి అసలు స్మార్ట్ మీటర్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం ఇంకా ఎన్నో కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఓ ట్రాన్స్ ఫార్మర్ల తయారీ కంపెనీ మాత్రమే అయిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్‌కు కొన్ని వేల కోట్ల పెట్టుబడుల అనుమతులు ఇచ్చారు. భూములు ఇచ్చారు. కడప నడిబొడ్డున యాభై ఎకరాలు రాసిచ్చారు. ఇలాంటివన్నీ బయటకు తీసి.. ఆ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ గుట్టును బయటకు లాగాలన్న అభిప్రాయం వినిపిస్తోంది.