ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక ఏపీలో సినీ పరిశ్రమను ఎక్కడికో తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేస్తోంది. ముందుగా భూసేకరణ చేయాలని నిర్ణయించుకుంది. విశాఖలో స్టూడియోలకు స్థలాలు ఇస్తామని సీఎం జగన్ ముగ్గురు హీరోలతో జరిగిన సమావేశంలో చెప్పారు . ఆ తర్వాత రెండు రోజులకే విశాఖతో పాటు తిరుపతి, రాజమహేంద్రవరంలోనూ స్టూడియోలకు భూసేకరణ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ అధికారులు భూముు గుర్తించాలని కింది స్థాయి అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చేశారు.
ఇంత వేగమా అని అందరూ ఆశ్చర్యపోయే పరిస్థితి. ప్రభుత్వం అసైన్డ్ ల్యాండ్స్ సహా ఏదీ వదలకుండా సేరకణ చేసి… సెంటు, సెంటున్నర చొప్పున స్థలాలు పంచేసింది. ఇంకా భూసేకరణ చేసి స్మార్ట్ టౌన్ షిప్‌ల పేరుతో అమ్మాకనికి పెట్టింది . స్టూడియోల కోసం మళ్లీ రైతుల వద్ద నుంచే భూములను సేకరించాని నిర్ణయించారు. ప్రభుత్వం ఇలా ప్రతీ పనికి రైతుల వద్ద నుంచి భూముల్ని సేకరించడం.. ఇతరులకు ధారదత్తం చేయడంపై చాలా కాలం నుంచి విమర్శలు ఉన్నాయి.
అయినా పట్టించుకోవడం కాదు అసలు ఆలోచించడం కూడా ఎప్పుడూ లేదు. ఇక ముందు ముందు స్టూడియోలకు భూమిలిస్తారో.. తీసుకున్న వారు స్టూడియోలు కడతారో లేదో కానీ భూసేకరణ మాత్రం ఖాయమని తేలిపోయింది. వైఎస్ హయాంలో ఓ జోక్ బాగా ప్రచారంలో ఉండేది. ఎక్కడైనాఓ ప్రాజెక్ట్ చెపట్టాలని ఆలోచన వస్తే చాలు మరో చోట భూసేకరణకు ఆదేశాలిస్తారని అంటూండేవారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోందని సెటైర్లు వేస్తున్నారు.