లక్షల కోట్లు ఏపీకి వచ్చేశాయని వైసీపీ నేతలు .. ప్రో వైసీపీ మీడియా ప్రచారం ఓ రేంజ్ లో ఉంది. అయితే ఇప్పటికీ సగం మంది ఉద్యోగులకు జీతాలివ్వలేకపోయారు. ఆ విషయం పక్కన పెడితే.. ఆ పెట్టుబడులన్నీ నిజాలని నమ్మించేందుకు తంటాలు పడుతున్నారు. కానీ ప్రభుత్వానికి … ఒక చాన్స్ ఉంది. ఆ పెట్టుబుడలన్నీ ఫేక్ కాదు నిజాలని నమ్మించడానికి. ఇంకా పాలనకు ఏడాది సమయం ఉంది. కనీసం పది శాతం గ్రౌండ్ చేయిచినా జగన్ సామర్థ్యంపై ప్రజలకు నమ్మకం పెరుగుతుంది.
ఏడాది తర్వాత రివ్యూ చేసి అసలు గ్రౌండ్ అయినవెన్నో చెప్పగలరా ?
ఏపీ ప్రభుత్వం తమ ప్రచార బలంతో పెట్టుబడుల సదస్సులో లక్షల కోట్లు పెట్టుబడులు సాధించామని గొప్పగా ప్రచారం చేసుకుంటుంది. అందులో సందేహం లేదు. అయితే ప్రభుత్వానికి ఇంకా ఏడాది సమయం ఉంది. రూ. పదమూడు లక్షల కోట్ల పెట్టుబడుల్లో కనీసం పది శాతం అయినా గ్రౌండ్ చేయించకపోతే…. ప్రజలు ఖచ్చితంగా తాము ఇవ్వబోయే తీర్పు విషయంలో పరిగణనలోకి తీసుకుంటారు. గత ప్రభుత్వం తాము తీసుకు వచ్చిన పెట్టుబడులను కళ్ల ముందు కనిపించేలా చేసింది. కియా దగ్గర నుంచి విజయవాడలో హెచ్ సీఎల్ వరకు.. అనేక దిగ్గజ కంపెనీలు వచ్చాయి. హీరో కూడా వచ్చింది. పారిశ్రామికంగా అనుకూల వాతావరణం ఏర్పడింది.
నాలుగేళ్లలో ఒక్క పరిశ్రమనూ ఎందుకు తేలేకపోయారు ?
కానీ ప్రస్తుత ప్రభుత్వం వచ్చి నాలుగేళ్లు అయినా ఆ ప్రభుత్వం చేసిన ఒప్పందాలను కూడా కొనసాగించలేకపోయింది. అంతర్జాతీయంగా సెంటిమెంట్ దెబ్బతిన్నది. ఎవరూ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదు. ఇప్పుడు పెట్టుబడుల సదస్సు పేరుతో హంగామా చేశారు. ఇక్కడా గోల్ మాల్ జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నీ కాదు.. తాము నిజంగానే పెట్టుబడులు తెచ్చి పెట్టామని చెప్పుకోవాలంటే ఖచ్చితంగా ఈ పెట్టుబడులననీ గ్రౌండ్ కావాలి.
అప్పనంగా భూములు కట్టబెడితే అడ్డగోలు స్కాములే…!
ఆయా సంస్థలకు లక్షల ఎకరాల భూములు కేటాయించి… తర్వాత వాటిని ఆ పెద్దలు బ్యాంకుల్లో తాకట్లు పెట్టుకుని… ఓ వాన్ పిక్.. మరో లేపాక్షిలాగా స్కాములు చేస్తే.. ప్రజలు ఈ సారి సహించే పరిస్థితి ఉండదు. పాలన చేస్తూ.. ప్రజల్ని పీల్చి పిప్పి చేయడమే కాకుండా వారి భూముల్ని కూడా దోపిడి చేస్తారంటే ఊరుకోరు. ప్రతీ సారి ఆ మార్క్ పనికి రాదు. అందుకే ప్రభుత్వం ముందు ఇప్పుడు ఉన్న ఒకే ఒక్క టార్గెట్.. చేసుకున్న ఎంవోయూలను వచ్చే ఏడాదిలో కనీసం పది శాతం గ్రౌండ్ చేయించి..చూపించాలి. లేకపోతే…. ప్రజల్ని దోచుకునే స్కెచ్ పెట్టుబడిదారుల సదస్సుల ద్వారా అమలు చేయడానికి సిద్ధమయినట్లే అనుకోవాలి.