దాదాపుగా ఇరవై లక్షల మంది ఇంటర్ విద్యార్థులు.. వారి తల్లిదండ్రులు, ఇన్విజిలేటర్లు అయిన ఉపాధ్యాయులు ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. లాక్ డౌన్ పెట్టాల్సిన పరిస్థితులు కళ్ల ముందు కనిపిస్తున్న సమయంలో పరీక్షలు పెట్టి తీరుతామని ఏపీ సీఎం ప్రకటించారు. గత ఏడాది కన్నా దారుణమైన పరిస్థితులు ఉన్న సమయంలో..ప్రభుత్వం ఎందుకు ఇంత పట్టుదలకు పోతుందనేది ఎవరికీ అర్థం కాని విషయం. అయితే సీఎం జగన్ ఆషామాషీగా ఈ ప్రకటనలు చేయడం లేదని… అన్ని వర్గాల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునే ఆయనపరీక్షలపై ముందుకెళ్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
పదో తరగతి అంటే ప్రతి ఒక్కరి విద్యాజీవితంలో అత్యంత కీలకం. అక్కడ సాధించే మార్కులు జీవితంలో అనేక దశల్లో … అండగా నిలబడతాయనడంలో సందేహం లేదు. అందుకే టీచర్లు కూడా.. టెన్త్ ఎగ్జామ్స్ ఇంపార్టెన్స్ గురించి చెబుతూ ఉంటారు. దానికి తగ్గట్లుగా విద్యార్థులు కష్టపడుతూంటారు. పరీక్షలు లేకపోవడంతో వారంతా నిరాశకు గురవతూంటారు. ఇష్టమో..కష్టమో పరీక్షలు రాయాలన్న పట్టుదలతోనే విద్యార్థులు ఉన్నారని .. ఆ విధమైన ఫీడ్ బ్యాక్ రావడంతోనే.. సీఎంజగన్ పరీక్షల నిర్వహణపై పట్టుదలతో ఉన్నారని చెబుతున్నారు.
విద్యార్థుల తల్లిదండ్రుల్లో కూడా ఎక్కువ మంది .. పరీక్షలు నిర్వహించాలన్న అభిప్రాయంతోనే ఉన్నట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా అభిప్రాయసేకరణ జరిపిందని.. వాటి సారాంశాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత జగన్ పరీక్షల నిర్వహణపై వెనక్కి తగ్గేది లేదని ప్రకటించారని అంటున్నారు. సీఎం స్థానంలో ఉండి వ్యక్తిగత పట్టుదలలకు సీఎం పోరని.. అదీ కూడా విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాల్సిన బాధ్యత యుత పదవిలో ఉన్నందున జగన్… విపక్షాల ఒత్తిడిని లైట్ తీసుకున్నారని చెబుతున్నారు.
పరీక్షల నిర్వహణ తర్వాత ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే.. అందరూ సీఎం జగన్నే తప్పు పడతారు. ఆ విషయంపై సీఎంకుస్పష్టమైన అవగాహన ఉంది. అలాంటి రిస్క్ తీసుకోవడానికి కూడా జగన్ సిద్ధమవతుున్నారు. అంటే… విద్యార్థుల భవిష్యత్ కోసమేనని.. ఇందులో రాజకీయం లేదని.. వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి సపోర్ట్ ఉండటం వల్లే జగన్… మొండిగా ముందుకెళ్తున్నారని గుర్తు చేస్తున్నారు.