అమరావతి శంఖుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముంబైకి చెందిన విజయవాడ క్రాఫ్ట్ ఈవెంట్ మేనేజిమెంట్ అనే సంస్థకు అప్పగించిన బాధ్యతను ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం స్వయంగా నిర్వహించాలని భావించడంతో ఆ కాంట్రాక్టు రద్దు చేసుకొంది. ప్రభుత్వం చేతిలో అంత మంది మార్బలం, సమర్దులయిన అధికారులు ఉండగా వేరే ప్రైవేట్ సంస్థకు ఆ బాధ్యత అప్పగించి, దానికి రూ.10 కోట్లు చెల్లించడానికి సిద్దపడి నందుకు ప్రతిపక్షాలు, ప్రజల నుండి కూడా విమర్శలు వస్తున్నాయి. అందుకే ముంబై సంస్థకు ఇచ్చిన అ కాంట్రాక్ట్ రద్దు చేసుకొని స్వయంగా ఏర్పాట్లు చేసుకొంటోంది. కానీ కేవలం పది కోట్లు మిగిల్చినట్లు చెప్పుకొని ఈ శంఖుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం కనీసం వంద కోట్లు వరకు ఖర్చు చేయబోతున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని నిత్యం పాటపాడే చంద్రబాబు నాయుడు శంఖుస్థాపన కార్యక్రమం కోసం ప్రజాధనం ఇంత విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.