తెలంగాణ ఎన్నికల్లో లబ్ది కోసం… కృష్ణా జలాల పంపిణీని సమీక్షిస్తామని కేంద్రం ప్రకటించడం.. కేబినెట్లో తీర్మానం చేయడంతో ఏపీ పరిస్థితి దారుణంగా మారింది. నీటి వాటాను కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. కృష్ణా డెల్టా ఇప్పటికే బీడుగా మారుతోంది. అత్యంత దిగువ రాష్ట్రం కావడంతో పై రాష్ట్రాలు ఇబ్బడిమబ్బడిగా ప్రాజెక్టులు కట్టేసి నీళ్లు ఆపేసుకుంటున్నాయి. భారీ వరదలు వస్తేనే కృష్ణానదిలో నీరు కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో.. నీటి వాటా పంపకాన్ని సమీక్షించేందుకు కేంద్రం సిద్ధమైంది.
ఏపీలో కేంద్ర నిర్ణయంపై ఆందోళన వ్యక్తమవుతుంది. రాయలసీమ పూర్తి ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు కర్ణాటకలోని అనుమతుల్లేని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్రం సాయం చేస్తోంది. మరో వైపు ఏపీ నీటి వాటా తగ్గించేలా నిర్ణయం తీసుకుంటోంది. ఇలాంటి ప రిస్థితులపై కేంద్రంపై పోరాటానికి.. ప్రధాని మోదీకి ఒక్కటంటే ఒక్క విజ్ఞప్తి చేయడానికి జగన్ రెడ్డికి ధైర్యం రావడం లేదు. మోదీకి లేఖ రాస్తామని హడావుడి చేశారు. కానీ ఏ లేఖా రాయలేదు.
అయితే ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసుల్లో మాత్రం.. కోర్టు తీర్పులు తేడా వస్తే రాత్రికి రాత్రి ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి పంపించి… ఎస్ఎల్పీలు దాఖలు చేస్తున్నారు. వీరి తీరు చూసి ఢిల్లీలో అందరూ నవ్వుకుంటున్నారు. ప్రజలు అధికారం ఇచ్చింది.. తమ సొంత ఆస్తులు పెంచుకోవడానికి.. అవినీతి చేసుకోవడానికి .. ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టడానికన్నట్లుగా ఉందని ..ఇదేం పాలన అని మొహం మీదనే చెబుతున్నారు. అయినా తుడిచేసుకుంటున్న ప్రభుత్వం .. తాము చేయాలనుకున్నదే చేస్తోంది.