హైకోర్టులో మాకు వ్యతిరేకంగా ఓ తీర్పు వచ్చిందంటే.. టీడీపీ నేతలకు కూడా అలాంటిది ఓ షాక్ ఇవ్వకపోతే పాలకులకు నిద్రపట్టదు. వివేకా హత్య కేసులో జగన్ రెడ్డి బంధువులకు బెయిల్ రాకపోవడంతో .. అప్పటికప్పుడు.. పగ తీర్చుకునే ప్రణళికను అమలు చేశారు. అంగళ్లు, పుంగనూరు ఘటనల్లో టీడీపీ నేతలకు హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టుకు వెళ్లింది ఏపీ ప్రభుత్వం.
ఈ కేసు వివరాలు చూస్తే సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో కానీ.. జగన్ రెడ్డి సర్కార్ ఎంత దారుణంగా రాజకీయ కక్షల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందో స్పష్టంగా అర్థమవుతుంది. హత్యాయత్నం కేసులు పెట్టడానికి కనీస ఆధారాలు లేకపోయినా ఉన్న వారందరి పేర్లు పెట్టి.. కేసులు నమోదు చేసి.. జైలుకు పంపాలనుకున్నారు. ముందస్తు బెయిల్ ఇచ్చేటప్పుడు హైకోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదు. ప్రాధమిక ఆధారాలూ సమర్పించలేదు. అయినా సుప్రీంకోర్టుకు వెళ్లారని.. న్యాయనిపుణులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
వ్యవస్థల్ని పూర్తిగా రాజకీయ కక్షలు.. రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడంలో రాటుదేలిపోయారు. ప్రజలు ఏమనుకుంటారోనన్న సంకోచం లేకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. అంగళ్లు, పుంగనూరు ఘటనలపై సుప్రీంకోర్టు నిజాలేంటో తెలుసుకుంటే.. ముందుగా పోలీసులే ఇరుక్కునే అవకాశం ఉంది.