విపక్షాలు రోడ్డెక్కకూడదంటూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు స్టే ఇచ్చింది. 20వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 23 వరకే స్టే ఇచ్చింది. అయితే కౌంటర్ దాఖలు చేయకుండా నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లింది ఏపీ ప్రభుత్వం. జీవో నెంబర్ 1పై హైకోర్టు ఇచ్చిన స్టే తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం కోరుతోంది.
ఈ జీవో చట్ట విరుద్ధమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు 23వ తేదీ వరకు జీవో నెంబర్ వన్ సస్పెండ్ చేస్తున్నట్లు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నెంబర్ వన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని అభిప్రాయపడిన కోర్టు ఈనెల 20వ తేదీలోగా కౌంటర్ కూడా దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు దారి జారీ చేయడమే కాక తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. అయితే కౌంటర్ దాఖలు చేయడానికి ముందే సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
సభలు, రోడ్ షోలు ఆపేందుకే జీవో తెచ్చారనేది నిజం కాదని… జీవో ద్వారా రోడ్ షో, పాదయాత్రలపై నిషేధం విధించడం వివాదాస్పదమవుతోంది. జీవో ఇచ్చిన తర్వాత కుప్పంలో వేల మంది పోలీసుల్ని పెట్టి చంద్రబాబును అడ్డుకున్నారు. పీలేరులోనూ అంతే. పైగా టీడీపీ నేతలు, మహిళలపై నేరుగా పోలీసులే హత్యాయత్నం కేసులు పెడుతున్నారు. మరో వైపు వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కానీ.. త్వరలో లోకేష్, పవన్ ప్రజల్లోకి వెళ్లనున్న సందర్భంలో వారిని కట్టడి చేయాల్సిందేనన్న ఉద్దేశంతో ఈ జీవో విషయంలో ప్రభుత్వం పట్టుదలకు పోతున్నట్లుగా భావిస్తున్నారు.