విశాఖలో జరిగిన ఘటనలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకుని విజయవాడ వచ్చారు. ఆయన కూడా గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కానీ చేయలేకపోయారు. గవర్నర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లుగా జనసేన నాయకులు చెప్పారు. కానీ పవన్ కల్యాణ్ గవర్నర్‌ను కలవలేకపోయారు. దీంతో గవర్నర్..పవన్‌కు అపాయింట్మెంట్ ఇవ్వలేదన్న ప్రచారం జరుగుతోంది.
అనూహ్యంగా పవన్ కల్యాణ్ ను.. ఆయన కుటుంబాన్ని చంపేస్తానని…అత్యాచారం చేస్తానని ప్రకటనలు చేసిన బోరుగడ్డ అనిల్ కుమార్ అనే క్రిస్టియన్ మత సంస్థను నడిపే వ్యక్తి విజయవాడ రాజ్ భవన్ ముందు ప్రత్యక్షమయ్యారు. తాను గవర్నర్ ను కలిశానని.. పవన్ కల్యాణ్ పై ఫిర్యాదు చేశానని చెప్పారు. అసలు ఇతనెవరు..పవన్ కల్యాణ్‌పై గవర్నర్‌కు ఎందుకు ఫిర్యాదు చేస్తారు..? అలా ఫిర్యాదు చేస్తానంటే గవర్నర్ అపాయింట్ మెంట్ ఇస్తారా అన్న డౌటనుమానం చాలా మందికి వచ్చింది.
అయితే పవన్ కు అపాయింట్ మెంట్ రాకుండా చేయడం.. ఆయనను దారుణంగా తిట్టిన వ్యక్తికి అపాయింట్మెంట్ వచ్చేలా చేయడం వెనుక వైసీపీ వ్యూహం ఉందన్న అనుమానం కూడా.. జనసేన వర్గాల్లో ఉంది. అయితే గవర్నర్ కు విజ్ఞప్తి చేసినా చేయకపోయినా.. పోయేదేమీ లేదని.. జనసేన వర్గాలంటున్నాయి. ఇలాంటి చర్యల ద్వారా తమ స్థాయి ఏంటో.. వైసీపీ చూపిస్తోందని అంటున్నారు.