వైసీపీ నేతలకూ మద్యం దుకాణాలు లాటరీలో తగిలాయి. ఏపీ ప్రభుత్వం మద్యం పాలసీని మార్చింది. అప్లికేషన్ పెట్టుకున్న వారికి లాటరీ పద్దతిలో దుకాణాలు లభించాయి. చాలా మంది వైసీపీ నేతలు పారదర్శకంగా జరుగుతాయా లేదా అని అనుమానం వ్యక్తం చేసుకున్నారు కానీ తమకు.. తమ సిండికెంట్ కు దుకాణాలు వచ్చే సరికి నమ్మక తప్పలేదు. రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణ టెండర్లలో కొంత మంది వైసీపీ నేతలకూ దుకాణాలు రావడంతో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడుకన్నా ఇప్పుడు ఉపాధి దొరుకుతోందని సంతోషపడుతున్నారు.
జగన్ అధికారంలోకి రాక ముందు మద్యం దుకాణాల వేలం పాలసీనే ఉండేది. కానీ అంతా తానొక్కనేడినే దోచుకోవాలనుకున్న జగన్ కొత్త మద్యం పాలసీ తెచ్చారు. దాని ప్రకారం.. మొత్తం ప్రభుత్వం చేతుల్లో అంటే జగన్ చేతుల్లో ఉంటుంది. దుకాణాల అద్దె, సిబ్బంది జీతాలు ఎక్సైంజ్ సిబ్బంది నెత్తిన పడేశారు. ఇక సొంత బ్రాండ్ల సరుకు నుంచి ట్రాన్స్ పోర్టు వరకూ మొత్తం వారి గుప్పిట్లోనే. మరెవరికీ ఒక్క రూపాయి పోకుండా చేసుకున్నారు. ఐదేళ్లలో వేల కోట్లు దోచుకున్నారు. బార్లకు కోట్లకు కోట్ల ఫీజులు పెట్టి త మపార్టీ నేతలు కూడా వద్దు బాబోయ్ అనుకుని పారిపోయేలా చేశారు .
ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం పాత పాలసీ తీసుకు వచ్చింది. టీడీపీ నేతల కూడా పెద్ద ఎత్తున అప్లికేషన్లు వేయాల్సి వచ్చింది. మంత్రి నారాయణ అప్లికేషన్లకు పార్టీ కార్యకర్తల కోసం డబ్బులు కట్టారు. అందులో నాలుగో.. ఐదో మాత్రమే లాటరీలో వచ్చాయి. వాటినే కార్యకర్తలకు ఉపాధి కోసం ఇచ్చారు. పలువురు టీడీపీ నేతలకు చాలా డబ్బులు అప్లికేషన్ల కోసం పోయాయి. అయితే ఎక్కువగా వైసీపీ నేతలు అప్లికేషన్లు వేయడానికి వెనుకడుగు వేశారు. కానీ ధైర్యం చేసిన వారికి మేలు జరిగింది. పారదర్శనక పాలన అని ఇప్పుడు వారు చింతిస్తున్నారు.