ఉత్తమ నటీనటులకు, సాంకేతిక నిపుణులకూ ప్రతి యేటా నంది అవార్డులు ప్రదానం చేసేవారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత అవార్డులు ప్రశ్నార్ధకంగా మారాయి. ఈ అవార్డుల ఊసేలేకుండా పోయింది. రెండు రాష్ట్ర్రాలకు కలిపి అవార్డులిస్తారా ? ఈ విషయంలో ఇరు ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి ? అనే చర్చలు జరిగాయి. చివరికి విడివిడిగానే ఇవ్వలాని నిర్ణయానికి వచ్చాయి.
ఇప్పుడీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఎట్టకేలకు నంది అవార్డుల ప్రకటన చేసింది. 2012, 2013 గాను నంది అవార్డుల విజేతల వివరాలు బయటికివచ్చాయి. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి నివేదికను అందజేసిన కమిటీ విజేతల వివరాలు వెల్లడించింది. 2012 సంవత్సర కమిటీకి జయసుధ, 2013 సంవత్సర కమిటీకి కోడి రామకృష్ణ ఛైర్మన్లుగా వ్యవహరించారు. 2012 సంవత్సరానికి గాను ‘ఈగ’, 2013సంవత్సరానికి గాను ‘మిర్చి’ ఉత్తమ చిత్రాలుగా ఎంపికయ్యాయి. అలాగే ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం విభాగంలో అత్తారింటికి దారేది విజేతగా నిలిచింది.
2012 విజేతలు
* ఉత్తమ చిత్రం- ఈగ
* రెండో ఉత్తమ చిత్రం- మిణుగురులు
* మూడో ఉత్తమ చిత్రం- మిథునం
* ఉత్తమ దర్శకుడు- రాజమౌళి(ఈగ)
* ఉత్తమ కథానాయకుడు- నాని(ఎటో వెళ్లిపోయింది మనసు)
* ఉత్తమ కథానాయిక- సమంత(ఎటో వెళ్లిపోయింది మనసు)
* ఉత్తమ సహాయనటుడు- అజయ్(ఇష్క్)
* ఉత్తమ సహాయనటి- శ్యామల(వీరంగం)
* ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం- జులాయి
* ఉత్తమ గాయకుడు- శంకర్ మహాదేవన్
* ఉత్తమ గాయని- గీతామాధురి
* ఉత్తమ సంగీత దర్శకులు- కీరవాణి(ఈగ), ఇళయరాజా(ఎటో వెళ్లిపోయింది మనసు)
*ఉత్తమ మాటల రచయిత : తనికెళ్ల భరణి (మిథునం)
*ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ : ఈగ
*ఉత్తమ గేయ రచయిత : అనంత్ శ్రీరామ్ (ఎటో వెళ్లిపోయింది మనసు)
*ఉత్తమ సంగీత దర్శకుడు : కీరవాణి(ఈగ), ఇళయరాజా(ఎటో వెళ్లిపోయింది మనసు)
*ఉత్తమ ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు
2013 విజేతలు
* ఉత్తమ చిత్రం- మిర్చి
* రెండో ఉత్తమ చిత్రం- నా బంగారు తల్లి
* మూడో ఉత్తమ చిత్రం- ఉయ్యాల జంపాల
* ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం- అత్తారింటికి దారేది
* ఉత్తమ కుటుంబ కథా చిత్రం- సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
* ఉత్తమ కథానాయకుడు- ప్రభాస్(మిర్చి)
* ఉత్తమ కథానాయిక- అంజలి(సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు)
* ఉత్తమ సహాయనటుడు- ప్రకాశ్‌రాజ్ (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు)