విశాఖలో కూల్చివేతల ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. వైజాగ్లో ఎక్కడా ఆక్రమణలే లేనట్లుగా ఒక్క టీడీపీకి చెందిన నేతలు.. సానుభూతిపరులే ఆక్రణలకు పాల్పడినట్లుగా.. తెల్లవారుజామునే… విరుచుకుపడుతున్నారు విశాఖ కార్పొరేషన్ సిబ్బంది. నోటీసులు .. సమయం ఇవ్వడాలు లాంటివి ఏమీ లేకుండా.. ఎప్పుడో గోడలకు అంటించేశామని చెప్పుకుని.. ఉదయమే.. బుల్డోజర్లతో వచ్చి కూల్చివేతలు చేస్తున్నారు. గీతం వర్శిటీకి చెందిన ప్రధానగేటు.. సెక్యూరిటీగదితో పాటు.. మరికొన్ని నిర్మాణానలను వీఎంసీ అధికారులు తెల్లవారుజామునే కూల్చేశారు. కనీసం వర్శిటీకి సంబంధిచి సిబ్బంది వచ్చేదాకా కూడా ఉండలేదు.
గీతం వర్శిటీకి వెళ్లే్ దారులను మొత్తం పూర్తిగా నిర్బంధించేశారు. విషయం తెలిసి.. అక్కడకు వెళ్లాలనుకున్న వర్శిటీ ఉన్నత ఉద్యోగులను కూడా అనుమతించలేదు. పూర్తిగా కూల్చివేసిన తర్వాతే.. వారిని ప్రదేశానికి అనుమతించారు. ఎలాంటి సమాచారం లేకుండా.. ప్రభుత్వం ఇలా విధ్వంసానికి పాల్పడటం అన్యాయమని వర్శిటీ వర్గాలు చెబుతున్నాయి. వివాదం కోర్టులో ఉండాగానే ఇలా కూల్చివేతలు చేయడంపై వర్శిటీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. హుదూద్ సమయంలో.. కరోనా సమయంలో వర్శిటీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టింది. ఉన్నత విద్యా సంస్థల విషయంలో ప్రభుత్వం ఇలా దూకుడుగా వ్యవహరించడం కరెక్ట్ కాదన్న అభిప్రాయం వినిపిస్తోంది.
గీతం వర్శిటీకీ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున విశాఖ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన.. భరత్ కుటుంబానికి చెందినది. ఆయన ఎంవీవీఎస్ మూర్తి మనవడు. కొద్ది రోజుగా.. గీతం వర్శిటీని టార్గెట్ చేసి వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. 40 ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే వివాదం న్యాయస్థానం పరిధిలో ఉందని.. వర్శిటీ చెబుతోంది. ఏదైనా కానీ.. విశాఖకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిన గీతం వర్శిటీలో కూల్చివేతలు.. విద్యార్థులు.. పూర్వ విద్యార్థులను మనస్థాపానికి గురి చేశాయి.