రోడ్డు ప్రమాదంలో గాయపడిన కత్తి మహేష్‌కు.. ఏపీ ప్రభుత్వం రూ. పదిహేడు లక్షల ఆర్థిక సాయం చేసింది. ఆయన ప్రస్తుతం చెన్నై ఆపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన తలకు.. కాళ్లకు గాయాలుకావడంతో కొన్ని ఆపరేషన్లు చేఏశారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెబుతున్నారు. కత్తి మహేష్ మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుగా ఉన్నారు. ఆ పార్టీ తరపున తిరుపతి ఉపఎన్నికలలో కూడా ప్రచారం చేశారు. ఈ క్రమంలో ఆయనకు ప్రమాదం జరిగినా… వైసీపీ వైపు నుంచి పెద్దగా సాయం అందడం లేదని.. ఆయన భార్య విమర్శలు చేసినట్లుగా .. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది.
ఈ లోపు.. ప్రభుత్వమే.. ప్రత్యేకంగా స్పందించి.. ఎవరూ దరఖాస్తు చేయకపోయినా.. రూ. పదిహేడు లక్షలు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. కత్తి మహేష్ రోడ్డు ప్రమాదానికి గురైనప్పటి నుండి సోషల్ మీడియాలో రెండు వర్గాలు తయారయ్యాయి. రకరకాల చర్చలు జరుపుతున్నాయి. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యంపై మాత్రం పట్టించుకునేవారు కరవయ్యారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స అంటే.. తక్కువ మొత్తంతో అయ్యే పని కాదు. ఆయన మిత్రులు చాలా మంది ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చినట్లుగా సోషల్ మీడియాలో ప్రటనలు చేశారు.
అయితే చివరికి.. ఎవరూ పెద్దగా సాయానికి ముందుకు వచ్చినట్లుగా లేదు. చివరికి ప్రభుత్వమే స్పందించి.. ప్రజాధనాన్ని రూ. 17 లక్షలు ఇచ్చింది. ప్రతీ రోజు.. ప్రమాదాల్లో కొన్ని వందల మంది గాయపడుతూంటారు. కానీ వారెవరికీ దక్కని అదృష్టం.. వైసీపీకి మద్దతు తెలిపినందుకు కత్తి మహేష్‌కు లభించింది. గతంలో వైసీపీ కార్యకర్తలు గాయపడినా.. ఆరోగ్యశ్రీ కింద మాత్రమే చికిత్స చేయించుకోవాల్సి వచ్చేది.