రాజధానిలో మరో శంకుస్తాపన తతంగంలో కొత్త వివాదాలు ముందుకొస్తున్నాయి. శుక్రవారం ఆరుణ్‌జైట్లీ పరిపాలనా భవనాల శంకుస్థాపన చేసిన యాభై ఎకరాలు ఆ భూముల యజమానులు సమీకరణ కింద ఇచ్చినవి కావట.వేదిక పక్కనే వున్న భూములు ప్రభుత్వ స్వాధీనంలో లేకపోవడం ఆసక్తికరం అక్కడ తనకున్న 7.76 సెంట్ల భూమి పూలింగుకు ఇవ్వలేదని మల్లెల శేషగిరి అనే రైతు చెబుతున్నారు.లింగాయపాలెం గ్రామస్తులైన అనుమోలు గాంధీ, చిట్టిబాబు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు.శంకుస్థాపన రాళ్లు పాతిన స్థలం పక్కనేతమ వాటిలోకి రావద్దని చెప్పడానికిే రైతులు ఎర్ర జెందాలు పెట్టారు.ిభూములు స్వచ్చందంగా ఇవ్వకపోతే సేకరణ పద్ధతిలో ఎకరాకు లక్ష చొప్పున డిపాజిట్ చేసి తీసేసుకుంటామని అధికారులు బెదిరింపు ధోరణిలో మాట్లాడ్డంతో కొందరు రైతులు చాలా ఆగ్రహం చెందారు.
పైగా ఇవి వరదముంపులో నీట మునిగే భూములు. ఆ మేరకు క్రిడా జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జిటి)కి నివేదిక కూడా ఇచ్చింది. ఎన్జిటికి ఇచ్చిన నివేదిక 111వ పేజీలో ముంపుకింద చూపిన చోటనే ఇప్పుడు పరిపాలనా భవనాల శంకుస్థాపన ప్రహసనం నడిచింది. ట్రిబ్యునల్ అంతిమ తీర్పునకు లోబడి ముందుకు పోతామని క్రిడా చెప్పిందట. ఇన్ని అస్పష్టతలు పెట్టుకుని ఆదరాబాదరగా శంకుస్థాపన చేసి ఏం సాధించారని రైతులు అడుగుతున్నారు. ముంపుకారణంగా నిర్మాణాలు వద్దని చెప్పిన చోటనే కట్టాలనుకోవడం ఎలా సమంజంసమని ప్రశ్నిస్తున్నారు.