ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేలుకుంది. కరోనాపై.. క్వారంటైన్ చర్యలు తీసుకుంది. సినిమా హాళ్లు, మాల్స్ ఈ నెల 31 వరకు మూసివేయాలని ఆదేశించింది. అయితే.. బార్లకు మాత్రం మినహాయింపునిచ్చారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించామని ఆరోగ్యమంత్రి ప్రకటించారు. తిరుమల ఆలయాన్ని కూడా.. మూసివేస్తున్నారు. పూజలన్నీ యధావిధిగా జరుగుతున్నప్పటికీ..భక్తుల్ని మాత్రం అనుమతించడం లేదు. ఓ మహారాష్ట్ర భక్తుడికి.. కరోనా లక్షణాలు కనిపించడంతో.. హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక్క తిరుమల మాత్రమే కాదు.. ప్రముఖ ఆలయాలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటే మంచిదని ప్రభుత్వం ప్రజలకు సలహా ఇచ్చింది. ఏపీలో కేవలం రెండు కరోనా కేసులే ఉన్నాయని విదేశాల నుంచి వచ్చిన 6 వేల మందిని గుర్తించామని మంత్రి ఆళ్లనాని ప్రకటించారు. వారందరికీ స్క్రీనింగ్ చేస్తామని.. సహకరించకపోతే చట్టపరంగా కేసులు పెట్టి జైలు శిక్ష విధించేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. కరోనా రెండో కేసు నమోదు కావడం… దేశం మెత్తం లాక్ డౌన్ అయ్యే సూచనలు ఉండటంతో.. ముఖ్యమంత్రి నేతృత్వంలో.. సమీక్ష నిర్వహించారు. తీసుకోవాల్సిన చర్యలు.. ఏర్పాట్లపై చర్చించారు. కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.
ఇప్పటికే.. బుధవారం నుంచి స్కూళ్లు, కాలేజీల మూసివేతకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు.. ఆలయాలు.. జనం గుమికూడే.. అంశాలపైనా దృష్టి పెట్టి నిర్ణయాలు తీసుసుకుంది. అదే ఎన్నికలు జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకునేది. నెలాఖరు వరకు ఎన్నికల ప్రక్రియ ఉండేది. ఇప్పుడు.. దేశం మొత్తం నెలాకరు వరకు.. నిర్మానుష్యంగా ఉండే అవకాశం ఉంది.