ఏపీలో మెగా డీఎస్సీకి ప్రభుత్వం ఇప్పటికే కీలక ప్రకటన చేసింది. 16,347పోస్టులతో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి క్యాబినెట్ ఆమోదం కూడా వేసింది. డీఎస్సీ ప్రక్రియను డిసెంబర్ లోపు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
అయితే, డీఎస్సీకి ముందు టెట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పటికే టెట్ పరీక్షకు అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. అయితే, ఆగస్టు 3వ తేదీతో టెట్ అప్లికేషన్ గడువు ముగియబోతుంది. దీంతో ఈ గడువును మరో వారం పొడిగిస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది.
మరోసారి టెట్ అప్లికేషన్ గడువు పొడిగించమని… అది సాధ్యం కాదని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు స్పష్టం చేశారు. అర్హులైన అభ్యర్థులంతా గడువులోగా అప్లై చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.
ఏపీలో ఇప్పటి వరకు 3,20,333లక్షల మంది టెట్ కు అప్లై చేసుకున్నారు. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహించబోతున్నామని… అక్టోబర్ 3వ తేదీ నుండి అక్టోబర్ 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. సెప్టెంబర్ 22వ తేదీ నుండి టెట్ పరీక్షకు సంబంధించిన హల్ టికెట్లు ఆన్ లైన్ లో అందుబాటులో ఉండనున్నాయి.