అమరావతిపై ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన ఆరు నెలల వరకూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయలేదు. ఆరు నెలల తర్వాత అప్పీల్ చేసి… ఎప్పటికప్పుడు త్వరగా విచారించాలని సుప్రీంకోర్టుకు లేఖ రాస్తోంది. తాజా విచారణ ఏడో తేదీన జరగాల్సి ఉంది. అయితే నాలుగో తేదీన సెలవు రోజైన శనివారం రోజు సుప్రీంకోర్టుకు .. ఏపీ ప్రభుత్వం తరపున లేఖ రాశారు. ఇది చాలా ఇంపార్టెంట్ కేసు అని.. ఆరో తేదీనే విచారించాలని అందులో కోరారు. ప్రభుత్వ విజ్ఞప్తిని చూసి న్యాయవర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి.
జనవరి 31న కేసు విచారణకు రావాల్సి ఉంది. కానీ బెంచ్ మీదకు రాలేదు. దాంతో తదుపరి విచారణ ఫిబ్రవరి ఏడో తేదీన నిర్ణయించారు. అయితే ప్రభుత్వం మాత్రం హఠాత్తుగా ఆరో తేదీనే విచారణ జరపాలంటూ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ను కోరుతోంది. ఇది అత్యవసర కేసు అని చెబుతోంది. రాజధానిపై నిర్ణయాధికారం … ప్రభుత్వానికి లేదన్న అంశం కీలకమని చెబుతోంది. మరీ అంత కీలకమైతే.. తీర్పు వచ్చిన ఆరు నెలల పాటు ఎందుకు సుప్రీంకోర్టు కు రాలేదు.. ఇప్పుడు ఏడో తేదీన విచారణ జరగాల్సి ఉంటే. .. ఒక్క రోజు కూడా ఆగలేకపోవడం ఏమిటి అన్నది చాలా మందికి వస్తున్న సందేహం. ఈ లాజిక్కులేమిటో అధికార పార్టీ నేతలకే తెలియాలి.
అదేమిటో కానీ సుప్రీంకోర్టు తీర్పు తమకు ముందే తెలిసినట్లుగా సీఎం సహా అందరూ విశాఖ రాజధాని అంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఇదిగో వెళ్లిపోతున్నామని చెబుతున్నారు. చివరికి వైసీపీ అనుకూల మీడియాలో .. సుప్రీంకోర్టు తీర్పు వచ్చేసిందని.. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చారని కూడా ప్రచారం చేసేస్తున్నారు. ఇదంతా చూస్తూంటే.. . సుప్రీంకోర్టు ఉల్లంఘనకు పాల్పడుతున్నారని పలువురు చీఫ్ జస్టిస్ కు ఫిర్యాదు చేస్త లే్ఖలు రాస్తున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారంలో ప్రభుత్వ తీరు అనేక రకాల అనుమానాలకు కారణం అవుతోంది.