అదానీ డేటా సెంటర్ పేరుతో కాపులుప్పాడలో అత్యంత విలువైన 130 ఎకరాలు అతి తక్కువ ధరకే ఇచ్చారు. ఏ కంపెనీకి చేయని విధంగా సేల్ డీడ్ కూడా చేశారు. అసలు అలా చేయడం నిబంధనలకు విరుద్ధమని తెలిసినా ముందుకెళ్లిపోయారు. ఇప్పుడా కంపెనీ ఇంకా ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదు. వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్ ’ అనే సంస్థను అదానీ ఏర్పాటు చేశారు. రూ.14,634 కోట్ల పెట్టుబడులు పెట్టి.. 24,990 మందికి ఉద్యోగాలు ఇవ్వాలనేది ఒప్పందం. అయితే ఇప్పటివరకూ అక్కడ అదానీ పునాదిరాయి కూడా వేయలేదు.
మంగళవారం జరిగిన పెట్టుబడుల ఇప్పుడు మరో 100 మెగావాట్ల డేటా సెంటర్ చేపడుతుందని, దానికి అన్ని రకాలుగా సహకరించాలంటూ పరిశ్రమల శాఖ అధికారులకు సీఎం సూచించారు. అంటే మరిన్ని ఎకరాల భూములు ఇవ్వబోతున్నారు. ఎన్ని ఎకరాలన్నది ఇంకా బయటకు రానివ్వలేదు. అదానీ కంపెనీల పరిస్థితులు తలకిందులయ్యాయి. అదానీలు అప్పులు తీర్చడానికే ఇప్పుడు తంటాలు పడాల్సిన పరిస్థితి. ఇక కొత్త అప్పులు సంగతేమో కానీ పెట్టుబడులు చాలా కష్టం. అందకే… పలు రాష్ట్రాల్లో అదానీ ప్రాజెక్టులు క్యాన్సిల్ అవుతున్నాయి. చివరికి యూపీలో ఇచ్చిన స్మార్ట్ మీటర్ల ప్రాజెక్టును ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది .
అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వమే. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం.. అసలు అన్నీ ప్రకటనలు చేసి పెద్ద ఎత్తున భూములు ఇతర సౌకర్యాలు పొందిన అదానీ ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకపోయినా సరే భూముల సంతర్పణ చేస్తూ పోతోంది. ఒక్క డేటా సెంటర్ కాదు. అదానీ ఏపీలో పెడతామని ప్రకటించిన ప్రాజెక్టుల్లో ఒక్క పని కూడా ప్రారంభం
అయినా ఆ కంపెనీ పట్ల ప్రభుత్వం ఎంతో సానుకూలంగా వ్యవహరిస్తోంది. ప్రజల సంపద.. రాష్ట్ర సంపదను దోచి పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ .. ఫార్ట్యూన్ 500 కంపెనీ అయినా… ఇచ్చే స్థలం యాభై ఎకరాల్లోపు అయినా అది బినామీ కంపెనీ అని చెప్పి వెళ్లగొట్టేసి ఏపీ ప్రభుత్వం ఇలాంటి కంపెనీలకు భూములు ఇస్తోంది. అవి భూములుగా చేతులు మారుతున్నాయి కానీ కంపెనీలుగా మారడం లేదు.