ఏపీ సచివాలయం అంటే రాష్ట్ర గౌరవం లాంటిది. ఆ గౌరవాన్ని తాకట్టు పెట్టడం అంటే ప్రభుత్వం తనకు తాను వాల్యూ కట్టుకుని తాకట్టు పెట్టుకోవడం . అదే చేసింది వైసీపీ సర్కార్. ఏపీ సచివాలయాన్ని…. అసెంబ్లీ భవనాలను కూడా తాకట్టు పెట్టేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారుతోంది.
అమరావతి సచివాలయాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం బ్యాంక్‌కు తాకట్టు పెట్టేసింది. రూ. 370 కోట్లు తెచ్చుకుని వాడేసుకుంది. ఇక తాకట్టు పెట్టడానికి ఏమున్నాయన్నది లిస్ట్ రాసుకున్నారేమో కానీ.. అసలు సచివాలయాన్ని తాకట్టు పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చిందన్నది వైసీపీ నేతలకూ అంతబట్టదు. ఆ ఆస్తిని తాకట్టు పెట్టాలంటే.. కనీసం సిగ్గుపడి ఉండాలని.. బయటకు తెలిస్తే పరువు పోతుందని కాస్త ఆలోచన చేసి ఉండాలన్న అభిప్రాయం వినిపిస్తోంది.
జగన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో విశాఖ నుంచి అమరావతి వరకూ సచివాలాయలు, కలెక్టరేట్లు సహా మొత్తం తాకట్టు పెట్టేశారు. ఆర్బీఐ నుంచి ఏటా లక్ష కోట్ల వరకూ అప్పులు తెచ్చారు. కానీ ఏపీలో ఒక్క రోడ్డు బాగు కాలేదు. ఒక్క ఆస్తి సృష్టించలేదు. మొత్తం దివాలా స్థితికి తెచ్చారు. చివరికి గౌరవాన్ని తాకట్టుపెట్టుకునే పరిస్థితికి తెచ్చారు. త్వరలో అమరావతిలో శిథిలమైన భవాలను కూడా తాకట్టు పెట్టనున్నారని అంటున్నారు. అందుకే అవి పూర్తయిపోయాయని ఉత్తర్వులు ఇస్తున్నారని.. భావిస్తున్నారు.
ఐదేళ్లు రాష్ట్రానికి సీఎంగా ఉండమని ఇస్తే.. ప్రజా ఆస్తుల్ని అమ్ముకోడానికి… తాకట్టుపెట్టడానికన్నట్లుగా పాలన సాగించారు. ఇక… ప్రైవేటు ఆస్తుల్ని కూడా తాకట్టుపెట్టి ఉంటారేమో… రికార్డులు బయటకు వస్తే తప్ప తెలియదు.