డెడ్‌లైన్ 31.. ఏపీ సర్కార్‌కి బడ్జెట్ టెన్షన్..!

మార్చి నెల 31వ తేదీలోపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి.. ఆమోదింపచేసుకోవాల్సి ఉంది. మరో వారం రోజులు మాత్రమే ఉంది .. ఇప్పటికిప్పుడు.. బడ్జెట్ ప్రవేశ పెట్టగలదేమో కానీ.. ఆమోదింపచేసుకోవడం మాత్రం సాధ్యం కాదు. బడ్జెట్ సమావేశాలు కాబట్టి… ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించాలి. ఆ తర్వాత బడ్జెట్ ప్రవేశ పెట్టాలి. చర్చ జరగాలి. ఆమోదించాలి. ఇదంతా సుదీర్ఘమైన ప్రక్రియ. అది ఆమోదం పొందితేనే… ఏప్రిల్ నెల ఖర్చులకు నిధులు విడుదల చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చివరికి జీతాలు అయినా.. బడ్జెట్ ఆమోదం పొందితేనే వస్తాయి. ప్రస్తుత పరిస్థితులు బడ్జెట్ ఆమోదం పొందడానికి అనుకూలంగా లేవు.

ఇప్పటికే కేంద్రం సహా.. దేశంలోని అన్ని రాష్ట్రాలు బడ్జెట్ సమావేశాలను పూర్తి చేశాయి. సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా.. మార్చి మొదటి వారంలో బ డ్జెట్ ప్రవేశ పెడుతుంది. గతంలో ఏపీ ప్రభుత్వాలు కూడా అదే చేశాయి. కానీ.. ప్రస్తుత ఏపీ సర్కార్.. బడ్జెట్ సమావేశాల కన్నా.. ప్రాధాన్యతగా స్థానిక ఎన్నికలను నిర్వహించాలనుకుంది. స్థానిక ఎన్నికల కోసం.. ఈ నెల 29వ తేదీ వరకూ షెడ్యూల్ ఖరారు చేసి.. 27వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనుకున్నారు. ఎలాగూ బ డ్జెట్ ఆమోదం పొందదు కాబట్టి.. రెండు నెలల ఖర్చుల కోసం తాత్కాలికంగా ఓటాన్ అకౌంట్ ఆమోదం పొందే వ్యూహాన్ని ఖరారు చేసుకున్నారు. ఆ ప్రకారం ఎన్నికలకు వెళ్లారు. కానీ ఈ లోపు కరోనా పంజా విసిరింది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ను 31వ తేదీ వరకూ లాక్ డౌన్ చేశారు. అత్యవసర సేవలు మినహా.. ఇతర విభాగాలకు సెలవులు ప్రకటించడమో… వర్క్ ఫ్రం హోం చేయడమో..ఇచ్చారు. దీంతో యంత్రాంగం అంతా.. ఇప్పుడు.. తీరిక లేకుండా ఇప్పుడు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలంటే.. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదిలి రావాల్సి ఉంటుంది. ఇప్పుడా పరిస్థితి సంక్లిష్టం. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత సీరియస్‌గా మారుతుందని కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలకు సంకేతాలు పంపింది. ఎక్కడికక్కడ ఆస్పత్రులు సిద్ధం చేయాలని సూచిస్తోంది. ఇలాంటి సమయంలో.. బడ్జెట్ పెట్టగలదా..? కనీసం రెండు నెలలకు అవసరమైన ఓటాన్ అకౌంట్‌ను ఆమోదింపచేసుకోగలదా.. అన్న ప్రశ్న ఉదయిస్తోంది. ఒక వేళ ఖర్చులకు అవసరమైన బడ్జెట్ ను ఆమోదించుకోవడంలో విఫలం అయితే.. అంత కంటే వైఫల్యం ప్రభుత్వానికి మరొకటి ఉండదనే అభిప్రాయాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close