ఏపీలో ఉద్యోగుకులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుంది. పారదర్శకంగా ఉద్యోగుల బదిలీలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 5 సంవత్సరాల గడువు పూర్తైన వారందరికీ బదిలీలు చేయాలని నిర్ణయించింది.
బదిలీలను వెంటనే చేసి, ఈ నెలాఖరు లేదా సెప్టెంబర్ మొదటి వారం కల్లా పూర్తి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో దీనిపై జీవో విడుదల చేయబోతున్నారు. సచివాలయం నుండి గ్రామ సచివాలయం వరకు ఉద్యోగులందరికీ బదిలీ చేయాలని… ముఖ్యంగా ఎక్కువ కాలం ఒకే చోట ఉన్న ఉద్యోగులకు స్థాన చలనం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈసారి బదిలీల్లో రూరల్ ఏరియాలు, స్పౌజ్ కేటగిరి, అంగవైకల్యం ఉన్న వారు, వ్యక్తిగత ఇబ్బందులున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని… ఈ బదిలీల్లో ఎక్కడా పారదర్శకత లోపించకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
5 సంవత్సరాల సర్వీసుకు కటాఫ్ డేట్ గా 2024, జులై 31గా నిర్ణయించినట్లు సమాచారం.
ఇక, ఈ బదిలీల ప్రక్రియ పూర్తి కాగానే… ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన రెవెన్యూ సదస్సులతో పాటు ఇతర ప్రభుత్వ కార్యక్రమాలను వేగవంతం చేయబోతున్నారు. ఈ బదిలీల కోసమే రెవెన్యూ సదస్సులను ప్రభుత్వం వచ్చే నెలకు వాయిదా వేసుకుంది.