ఏపీ సీఎం జగన్ అధికారులతో చేసే సమీక్షల్లో ఏం జరుగుతుందో తెలియదు కానీ.. ఎడిటింగ్ చేసిన వీడియోలు విడుదల చేస్తారు. ఓ ప్రెస్ నోట్ మాత్రం వస్తుంది. అ ప్రెస్నోట్లో ఏ శాఖకు చెందినదయితే.. అది గత మూడేళ్ల కిందట ఏముందో..అందులో కొంచెం కొంచె మార్పులతో ఇప్పటికీ ఇస్తూంటారు. అలా చేస్తాం.. ఇలా చేస్తాం… సీఎం ఆదేశించారని చెబుతూంటారు కానీ.. ఒక్క పనీ ముందుకు సాగదు. తాజాగా ఫ్యామిలీ డాక్టర్లంటూ హడావుడి చేసి .. ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభిస్తామని జగన్ పదే పదే చెప్పారు. చివరికి ఆగస్టు పదిహేను వచ్చింది కానీ ఎవరూ పట్టించుకోలేదు.
సీఎం మాటనే పట్టించుకోరా అని ప్రజలు ఆశ్చర్యపోయారు. నిజానికి సమీక్షలో అలా చెబుతారు కానీ.. దానికి తగ్గట్లు చర్యలను ఎవరూ పట్టించుకోరు. రకరకాల అడ్డంకులు వస్తాయి. అందరూ లైట్ తీసుకుంటారు. ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ కూడా అంతే. టీడీపీ హయాంలో .. గ్రామాల్లో సేవలందించడానికి మొబైల్ హాస్పిటల్స్ ను ప్రారంభించారు. వాటిని మరింత విస్తృత పరిచి .. కేంద్రం ఇస్తున్న నిధులతో హెల్త్ క్లీనిక్లు నిర్మించి .. అందులో వైద్యులను నియమించాలనుకున్నారు. కానీ ఆ పనులేమీ చేయలేదు. సీఎం డెడ్ లైన్ పెట్టినా ఎవరూ పట్టించుకోలేదు. చివరికి ఇప్పుడు మళ్లీ సంక్రాంతి నుంచి ప్రారంభిస్తామనే మాటలు చెబుతున్నారు.
ఈ ఒక్క విషయం మాత్రమే కాదు… ప్రతి విషయంలోనూ అదే తంతు. రోడ్ల గురించి జూలై పదిహేను డెడ్ లైన్ పెట్టారు. కానీ సీఎం చెప్పిన మాటను పట్టించుకోవాల్సిన అవసరం ఏముందని అధికారులు మిన్నకుండిపోయారు. సీఎం కూడా అడగలేదు. అడిగితే.. నిధులేవీ అంటారు మరి. పాలన కేవలం.. ప్రకటనల కోసమే అన్నట్లుగా సాగుతోందని… అసలు మాటలకు.. చేతలకు పొంతనే ఉండదని అధికార వర్గాలు కూడా గుసగులాడుకుంటున్నాయి.