హైకోర్టు విభజన ప్రక్రియతో గాని, వివాదంతో గాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏసంబంధమూ లేదు. అమరావతి ప్రాంతంలో జస్టిస్ సిటి కి స్ధలం కేటాయించడం వరకే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. అక్కడ న్యాయ విభాగ సముదాయాలను ఎలా నిర్మించాలన్న ప్లానింగ్ న్యాయవ్యవస్థ చేయాల్సిందే నిధులను సమకూర్చవలసింది కేంద్రప్రభుత్వమే!
ఇదికాక ఎవరు ఏమి చెప్పినా అబద్దమే! రాజకీయవాదులు,శాంతికాముకులు సూచిస్తున్నట్టు ఇద్దరు ముఖ్యమంత్రులు కలసి మాట్లాడుకోవలసిన అవసరమేదీలేదు. హైకోర్టు విభజనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుపడుతుందని ఉద్దేశ్యపూర్వకంగా అబద్దాలు చెబుతున్న తెలంగాణా నాయకులతో సంప్రదించడమంటే నిద్ర నటిస్తున్న వాళ్ళని నిద్రలేపే ప్రయత్నం చేయడం లాంటిదే!
విభజన చట్టంలోని తొమ్మిది, పదవ షెడ్యూళ్లలోని ఉమ్మడి సంస్థల విభజన వంటి అనేక అంశాలు ఇప్పటికీ అమలు కాలేదు. రాజధానిని పూర్తిగా హస్తగం గుర్తుచేసుకున్న తెలంగాణా ప్రభుత్వామే అందుకు బాధ్యత వహించాలి. అన్నిటినీ వదిలేసి ఒక్క హైకోర్టు విభజన అంశాన్నే ముందుకు తేవడం ఎంత సమంజసమో వారికే తెలియాలి.
విభజన తర్వాత ఏడాదిలోగా ఈ ఉమ్మడి సంస్థల విభజనపై రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి అంగీకారం, ఏకాభిప్రాయం కుదరకపోతే కేంద్రం జోక్యం చేసుకొని చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా పంపిణీ చేయాలని విభజన చట్టమే చెబుతోందిలాగుతున్నాయని అనిపించినపుడల్లా కెసిఆర్ ఆంధ్రోళ్ళ దోపిడి గురించి గుర్తు చేసి మంటపెంచేవారు. ఇపుడు ఆయన ఎన్నికల హామీలు ఆయన్నే కదలనివ్వకుండా చిక్కుముడులు పడిపోయాయి. షరా మామూలుగానే ఎపి ప్రభుత్వం మీదా, చంద్రబాబు నాయుడు మీద నిందలు మొదలు పెట్టారు.
ఉమ్మడి హైకోర్టును కొనసాగించడం ద్వారా తెలంగాణపై పెత్తనాన్ని కొనసాగించాలని ఆంధ్ర నాయకులు కోరుకొంటున్నారన్నదే ఆ నింద మాత్రమే!
హైకోర్టు తక్షణ విభజనను కోరుతూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఢిల్లీలో ధర్నా చేయాలనుకోవడం కెసిఆర్ ఇష్టం! అందుకోసం చంద్రబాబు పై నిందలేయడం ప్రజల్ని పక్కదారి పట్టించే ప్రయత్నమే!