ఫోన్ ట్యాపింగ్ కేసులో దాఖలైన పిటిషన్లను హైకోర్టు సీరియస్గా తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. లాయర్ శ్రవణ్ కుమార్ దాఖలు చేసిన అసలు పిటిషన్..దానికి మళ్లీ వేసిన అనుబంధ పిటిషన్ను కలిపి పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు మొత్తం పదహారు మందికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో వివరాలు చెప్పాలని.. వ్యక్తిగతంగా కానీ..న్యాయవాది ద్వారా కానీ హాజరు కావాలని ఆదేశించింది. ఈ పదహారు మందిలో సీబీఐ కూడా ఉంది. అలాగే సర్వీస్ ప్రోవైడర్లు కూడా ఉన్నారు. రిలయన్స్ జియో, వోడాఫోన్, ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్,..ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అసోసియేషన్ అధ్యక్షుడు నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు.
లాయర్ శ్రవణ్ కుమార్ దాఖలు చేసిన అనుబంధ అఫిడవిట్లో ప్రభుత్వం ప్రత్యేకంగా ట్యాపింగ్ కోసం నియమించిన అధికారి పేరును .. అలాగే.. కొంత మంది సర్వీస్ ప్రొవైడర్ల వద్ద నుంచి ఎలా కాల్ డేటాను సేకరిచారో వివరించే..కొన్ని ఆధారాలను సమర్పించినట్లుగా తెలుస్తోంది. ఆఫిడవిట్లో ఏం చేప్పారన్న విషయం బయటకు రాలేదు. అయితే.. కోర్టు సంతృప్తి చెందేలా…వివరాలు ఉండటంతోనే నేరుగా.. సీబీఐతో పాటు.. సర్వీస్ ప్రొవైడర్లకు.. టర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అసోసియేషన్ కి కూడా నోటీసులు పంపినట్లుగా భావిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులు ట్యాపింగ్ చేసి ఉంటే.. సాంకేతికంగా తెలుసుకోవడం చాలా సులభమేనని అంచనా వేస్తున్నారు.
అలాగే సర్వీస్ ప్రోవైడర్ల వద్ద నుంచి పోలీసులు తీసుకున్న కాల్ డేటా వివరాలు కూడా.. ప్రోవైడర్లు కోర్టుకు సమర్పించనున్నారు. నాలుగు వారాల తర్వాత కేసు విచారణకు రానుంది. అప్పుడు విచారణ కీలక మలుపులు తిరిగే అవకాశం ఉంది. దర్యాప్తునకు ఆదేశించాలా వద్దా అనేది కోర్టు అప్పుడే నిర్ణయించనుంది.