కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి సిఫారసు చేస్తూ ఏపీ కెబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల హామీలో భాగంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని నిర్ణయంచారు. అక్కడ వైసీపీ ప్రభుత్వం పెట్టిన లోకాయుక్త, ఇతర చిన్న కోర్టుల వల్ల ఆయా కోర్టులను ఆశ్రయించాలనుకున్న వారికి సమస్యలు ఎదురవూతూండటంతో అన్నింటిని అమరావతికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తే దానికి అనుబంధంగా ఇతర కోర్టులను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ఏపీ హైకోర్టు ద్వారా సుప్రీంకోర్టుకు ప్రతిపాదనకు పంపాలి. కేంద్రం అనుమతితో బెంచ్ ఏర్పాటు చేస్తారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు బీజేపీ కూడా మద్దతు పలికింది. కేబినెట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గంజాయి, డ్రగ్స్ నివారణకు ఈగల్ పేరుతో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేాయలని నిర్ణయించారు. అమరావతి పనులకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని నిర్ణయించారు.
రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ అనుమతులను అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల నుంచి తొలగించి అనుమతులను ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లే ఇచ్చేలా ఏపీ మెట్రో రీజియన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్ట సవరణకు ఆమోదం తెలిపారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లపై అవిశ్వాస తీర్మానానికి ఉన్న గడువు తగ్గించలా చట్ట సవరణకు క్యాబినెట్లో ఆమోదముద్ర వేసింది.