సీఎస్‌గా పని చేసిన రిటైరైన వెంటనే ప్రభుత్వ సలహాదారుగా పదవి పొందిన నీలం సహానికి.. సర్వీస్‌లో ఉన్నప్పుడు.. సరిగ్గా పని చేయకపోవడం వల్ల చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎస్ఈసీ చెప్పినట్లుగా చేయలేదు. దాంతో ఆయన హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు తమ ఎదుట హాజరు కావాలని నీలం సహానీతో పాటు ప్రస్తుత పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీని కూడా ఆదేశించింది. ఇటీవల నీలం సహాని చీఫ్ సెక్రటరీగా పదవి విరమణ చేశారు. అమె హయాంలో… ఎస్ఈసీతో ప్రభుత్వం తీవ్రమైన పోరాటం చేసింది. ఎస్ఈసీ ఆదేశాలను పాటించలేదు.
ప్రభుత్వం చెప్పినట్లుగా చేయాలి కాబట్టి… ఎస్ఈసీ ఆదేశాలను నీలం సహాని కూడా పట్టించుకోలేదు. అంతకు ముందు హైకోర్టు.. ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీకి సహకరించాల్సిందేనని స్పష్టమైన తీర్పు ఇచ్చి ఉంది. హైకోర్టు చెప్పినప్పటికీ… సహకరించలేదని ఆరోపిరిస్తూ… ఎస్ఈసీ నిమ్మగడ్డ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ తర్వాత పరిణామాలు వేగంగా జరిగాయి. సుప్రీంకోర్టు ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ప్రభుత్వ యంత్రాంగం అంతా ఎన్నికలకు సహకరించడం జరిగిపోయాయి. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడు ప్రభుత్వ సహకారం లేదు అనే ప్రశ్నే లేదు. అయితే ఆమె హయాంలో ప్రభుత్వం నుంచి సహాయనిరాకరణ ఎదురయింది.
ఎస్ఈసీకి సహకరించకపోవడం అనేది తీవ్రమైన చర్య అవుతుంది. అయితే నిమ్మగడ్డ ఆ ఈ అంశాన్ని కోర్టు ద్వారా తేల్చాలనుకున్నారు. అందుకే పిటిషన్ వేశారు. అయితే ప్రస్తుతం ఎన్నికలు సజావుగా సాగుతున్నందున.. హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరం. తర్వాతి వాయిదాలో ద్వివేదీతో పాటు సహాని కూడా వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంది. తర్వాతి విచారణ వచ్చే నెల చివరిలో జరగనుంది.