అమరావతి రైతులు ఆరు వందల మందితో మాత్రమే పాదయాత్ర చేయాలని సంఘిభావం చెప్పే వారెవరూ కలిసి నడవకూడదని.. హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు విధించిన ఆంక్షల్ని సడలించేది లేదని తీర్పు ఇచ్చింది. మరో వైపు రైతులు షరతులు ఉల్లంఘిస్తున్నారని ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయని పాదయాత్రకు అనుమతిని రద్దు చేయాలని ఏపీ డీజీపీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టి వేసింది. పాదయాత్రలో ఆరు వందల మంది రైతులు… ఐడీ కార్డులు ఉన్నవారు మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని ఉత్తర్వులు జారీ చేసింది.
రెండు వైపులా నిలబడి మద్దతు తెలపాలని సూచించింది. పాదయాత్రలో కలిసి నడవకూడదని హైకోర్టు ఆంక్షలు విధించింది. మద్దతు ఇచ్చేవాళ్లు పాదయాత్రలో కలిసి నడవకుండా చూసే బాధ్యత పోలీస్ అధికారులదేనని తెలిపింది. పాదయాత్ర ప్రశాంతంగా జరిగే విధంగా పోలీసులు చూడాలని ఆదేశించింది. ఆరు వందల మందికి పోలీసులు ఐడీ కార్డులు ఇవ్వలేదని నూట యభై మందికి మాత్రమే ఇచ్చారని… రైతులు హైకోర్టుకు తెలిపారు. పాదయాత్రలు చేస్తున్న ఎవరికీ లేని ఆంక్షలు తమకు ఎందుకని కోర్టును ఆశ్రయించారు. అయితే వారికి ఊరట లభించలేదు. ఆ
పది రోజుల కిందట అమరావతి రైతుల పాదయాత్రపై హైకోర్టు ఆంక్షలు విధించినప్పుడు ఐడీ కార్డులు చూపించాలని రైతులపై పోలీసులు విరుచుకుపడ్డారు. పోలీసుల తీరుకు నిరసనగా పాదయాత్రను నిలిపివేసి న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు వారికి ఊరట లభించలేదు. దీంతో రైతులు ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. మరో వైపు రైతుల పాదయాత్ర ఆగిపోయినట్లేనని వైసీపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు.