నిజంగా కోడికత్తితో దాడి చేశాడని నేరం నిరూపణ అయినా ఐదేళ్లకుపైగా శిక్ష పడుతుందో లేదో కానీ.. కోడి కత్తి శీను మాత్రం… విచారణలోనే ఐదేళ్లకుపైగా జైలు శిక్ష అనుభవించాడు. ఎంతో భవిష్యత్ ఉన్న ఆయన ఐదేళ్ల పాటు జైలుకు పరిమితమై.. ఆ దళిత యువకుడికి ఎందుకు అన్యాయం చేస్తున్నారని అందరూ గళమొత్తితే చివరికి.. బెయిల్ దక్కింది. జగన్ రెడ్డి ఎన్వోసీ ఇచ్చినా. ఆయన కోర్టుకు హాజరై ఉన్నా ఎప్పుడో బెయిల్ వచ్చేది. కానీ జగన్ రెడ్డి ఈ ఎన్నికల్లోనూ కోడి కత్తి దాడి గురించి ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ది పొందాలనుకున్నారేమో కానీ ఆయనను జైల్లోనే ఉంచాలనుకున్నారు. తాను కోర్టుకు హాజరు కాకపోతే.. ఎన్వోసీ కూడా ఇవ్వలేదు.
పైగా కోడి కత్తి కేసు ట్రయల్ జరగకుండా అడ్డుకున్నారు. ఇంకా లోతైన విచారణ చేయాలంటూ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కారణంగా హైకోర్టు అసలు ట్రయల్ నిలిపివేసిన పరిస్థితి ఏర్పడింది. చివరిి రాష్ట్రం మొత్తం.. దళితుడైన తన డ్రైవర్ ను హత్య చేసిన ఎమ్మెల్సీకి బెయిల్ ఇచ్చిన న్యాయవ్యవస్థ.. కోడి కత్తితో దాడి చేసిన శీనుకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నలు రావడం ప్రారంభించాయి. చివరికి శీను తల్లిదండ్రులు దీక్షలు కూడా చేశారు. ఇప్పుడు వారితల్లిదండ్రులు పాదయాత్ర చేయాలనుకుంటున్నారు.
తన కుమారుడికి విముక్తి ప్రసాదించాలని శీను తల్లి చేసిన పోరాటం అంతా ఇంతా కాదు. నిరుపేదలైన వారి స్థితిని కనీసం జగన్ అర్థం చేసుకోలేకపోయారు. అచ్చమైన జగన్ రెడ్డి అభిమని అయిన కోడి కత్తి శ్రీనివాస్ .. చేసిన పని వల్ల జగన్ రెడ్డి ఎంతో లాభపడ్డారు. కానీ చిన్న కన్సర్న్ కూడా ఆయనపై చూపలేకపోయారు.