అనేక రకాల కుట్రల విషయంలో వైసీపీ పెద్దల ప్లానింగ్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అయిపోతుంది. చేయాలనుకున్నది చేసేయడానికి నాలుగు మార్గాలను ఎంచుకుంటారు. అందులో ఒక దాని ద్వారా చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంటారు. చివరికి చేసేస్తారు. ఓటర్ల ఖాతాల్లో రూ. పధ్నాలుగు వేల కోట్ల నగదు బదిలీ చేయడానికి కూడా ఇదే ప్లాన్ వేశారు. ఈసీ అనుమతి ఇవ్వదని తెలిసు… అయినా కొంత మందిని ముందస్తు ప్రణాళిక ప్రకారం వెంటనే కోర్టులో పిటిషన్ వేయించడం… కోర్టు ఒక్క రోజులో డబ్బులు జమ చేసుకోవడానికి చాన్సివ్వడం చకచకా జరిగిపోయాయి. ఉదయం విచారణలో తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ నాలుగు నెలలుగా ఆపేసిన డబ్బులు శుక్రవారం ఓటర్ల ఖాతాలో జమ చేసుకోవచ్చని శని, ఆది, సోమ వారాల్లో మాత్రం చేయకూడదని ఆదేశాలిచ్చారు. ఏ రోజు అయితే ఏముంది.. మాకు కావాల్సింది ఓటర్ల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం చేసేస్తామని ప్రభుత్వం రెడీ అయింది.
ఎన్నికలకు ముందు ఓటర్ల ఖాతాలో డబ్బులు జమ చేస్తే లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ దెబ్బతింటుందని అది అనధికారికంగానే ఓట్ల కొనుగోలు అవుతుందని ఈసీ ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే ఈ సీ అనుమతి ఇవ్వలేదు. పోలింగ్ అయిన తర్వాత పదమూడో తేదీ తర్వాత అంటే మూడు, నాలుగు రోజుల తర్వాత జమ చేసుకోవచ్చని చెప్పింది. కానీ హైకోర్టున్యాయమూర్తి శుక్రవారం ఒక్క రోజు డబ్బులు జమ చేసుకోవచ్చని .. ఈసీ ఆదేశాలపై ఒక్క రోజు స్టే ఇచ్చారు. ఉదయం రిజర్వ్ చేసిన తీర్పు రాత్రి బయటకు వచ్చింది. తీర్పు అనుకూలంగా వస్తుందని ముందుగానే ఊహించిందేమో అప్పటికే ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు ప్రారంభించింది.
నిధులు జమ చేయాలంటే ముందుగా బడ్జెట్ రిలీజింగ్ ఆర్డర్స్ రావాల్సి ఉంది. ఆ ఆర్డర్స్ లేవు. ఓ ప ద్దతి ప్రకారం నిధులు జమ చేయాలి. ఎందుకంటే అవి గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించినవి. కానీ ముందుగా జమ చేసిన తర్వాత ఉత్తర్వుల సంగతి తేల్చుుకుందామని… ఉన్నతాధికారులు అనుకుంటున్నారు. అంటే.. ఎలాగైనా నిబంధనలు ఉల్లంఘించి అయినా సరే డబ్బులు జమ చేయాలని నిర్ణయించుకున్నారు. హైకోర్టు నిర్ణయం ఇందుకు ఆసరాగా మారుతోంది.