హత్యాయత్నం కేసు పెట్టి అదుపులోకి తీసుకుని 41A నోటీసు ఇచ్చి ఎలా వదిలేశారని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇష్యూలో హైకోర్టు ..పోలీసుల్ని ఆశ్చర్యంగా ప్రశ్నించింది. దానికి ప్రభుత్వ న్యాయవాది… గొప్పగా వాదించారు. పోలీసులకు ఆ అధికారం ఉందన్నారు. హైకోర్టులో జరిగిన ఈ వాదనలు చూసినా.. చదివిన ఎవరికైనా.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అనే వ్యక్తి.. టీడీపీనా అనే అనుమానం వస్తుంది. కానీ పట్టపగలు టీడీపీ అభ్యర్థిపై అత్యంత ఘోరంగా హత్యాయత్నానికి కుట్ర చేసిన వ్యక్తి తెలిస్తే మూర్చపోతారు. అంత ఘోరమైన నేరం చేసిన వ్యక్తిని అరెస్టు చేసి 41A ఇచ్చి ఎందుకు వదిలేశారు ?. హైకోర్టుకు కూడా ఇదే డౌట్ వచ్చింది. మరి ఇతరులకు రాకుండా ఉంటుందా ?
చెవిరెడ్డి మోహిత్ రెడ్డి .. పులివర్తి నానిపై చేసిన కుట్రకు అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. అందుకే ఎఫ్ఐఆర్లో పేరు నమోదు చేశారు. లుకౌట్ నోటీసు జారీ చేశారు. అరెస్టు చేస్తారని తెలియడంతో దుబాయ్ పోయేందుకు ప్లాన్ చేసుకున్నారు. విషయం తెలిసి అరెస్టు చేసుకొచ్చారు. మరి ఎందుకు జైలుకు పంపలేదో… ఎవరికీ అర్థం కాలేదు. హత్యాయత్నం కేసులో ఎక్కడైనా 41A నోటీసులు ఇచ్చిన సందర్భం కూడా లేదు. మరి ఎందుకు చెవిరెడ్డిల మోహిత్ రెడ్డిపై అంత ఔదార్యం చూపారు ?
Read Also : వైసీపీ నేతలకు నొప్పి తెలుస్తుందా ?
ఈ వ్యవహరం తెలుగుదేశం పార్టీ శ్రేణుల స్థైర్యాన్ని దెబ్బతీస్తోంది. చిన్న చిన్న సోషల్ మీడియా కేసుల్లోనే తలుపులు బద్దలుకొట్టి అరెస్టు చేసిన వైనాన్ని చూసిన టీడీపీ క్యాడర్.. ఇప్పుడు హత్యాయత్నం కేసుల్లోనూ.. నోటీసులతో బయటకు వచ్చి.. పోలీస్ స్టేషన్ ముందే సవాళ్లు చేస్తూంటే… ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. వైసీపీ సోషల్ మీడియా సైకోలు రెచ్చిపోతున్నారు. మళ్లీ అందరిపై మార్ఫింగ్లు.. తప్పుడు ప్రచారాలు ప్రారంభించారు. పోలీసు వ్యవస్థను వైసీపీ వాడుకున్నట్లుగా వాడుకోవడం కదా కదా.. చట్టబద్ధంగా కాకుండా.. వైసీపీకి ఇంకా ప్రివిలేజెస్ ఉన్నట్లుగా వ్యవస్థను నడిపించడమే అసలు విషాదమని టీడీపీ క్యాడర్ అంటోంది.
టీడీపీ క్యాడర్ అంతా కసితో పని చేయడానికి కారణం అధికారం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి స్కోర్లు సెటిల్ చేయాలనే. ఇప్పుడు అధికారం వచ్చినా… పరిస్థితుల్లో మార్పు రాకపోవడం వారిని నిరాశకు గురి చేస్తోంది.