నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ విషయంపై గతంలో ఏపీ సీఐడీ నిర్వహించిన దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించింది. కొద్ది రోజుల సీఐడీ వేధింపులకు గురి చేస్తోందని.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వద్ద పీఎస్‌గా పని చేసిన సాంబమూర్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. అలాగే.. ఎస్ఈసీగా నిమ్మగడ్డ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత.. తన కార్యాలయంలో డేటా చోరీకి గురయిందని.. కంప్యూటర్ తీసుకెళ్లారని.. సీఐడీ ఉద్దేశపూర్వకంగా వేధిస్తోందని.. మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేయించాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లను కలిపి ఒకే సారి విచారిస్తామని హైకోర్టు తెలిపింది. అలాగే… ప్రభుత్వం కౌంటర్ వేసే వరకు తదుపరి చర్యలు నిలిపివేయాలని సీఐడీని ఆదేశించింది.
తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఎస్ఈసీగా తనకు భద్రత లేదని.. కేంద్ర బలగాలతో రక్షణ కావాలని రమష్ కుమార్ కేంద్ర హోంశాఖఖు లేఖ రాశారు. అయితే ఆ లేఖ మీడియాలో వచ్చింది. దాన్ని రమేష్ కుమార్ రాయలేదని… ఎవరు రాశారో కనిపెట్టాలంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డీజీపీ గౌతం సవాంగ్ కు లేఖ రాశారు. ఆ లేఖ తానే రాశానని.. రమేష్ కుమార్ చెప్పినా.. సీఐడీ వినిపించలేదు. అసలు కేసు నమోదు చేశారో కూడా తెలియదు. నిజంగా సీఐడీ కేసు నమోదు చేయాలంటే… లేఖ రాసిన వ్యక్తి లేదా.. అందుకున్న కేంద్ర హోంశాఖ ఫిర్యాదు చేయాలి… కానీ విజయసాయిరెడ్డి లేఖ రాశారు…సీఐడీ దర్యాప్తు చేసింది.
దీంతో ఇదంతా ఉద్దేశపూర్వకంగా.. దురుద్దేశంతో చేశారన్న అభిప్రాయం న్యాయవాద వర్గాల్లో ఏర్పడింది.ఇప్పుడు దీనిపై ఇప్పుడు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. ఈ విషయంలో కూడా సీఐడీకి.. న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయన్న అంచనా ఏర్పడుతోంది. ప్రభుత్వం దాఖలు చేసే కౌంటర్ ను బట్టి… ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.