హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలిగింది. నిన్నామొన్నటిదా కాదా.. జీవోలను చట్ట వ్యతిరేకంగా నిర్ణయిస్తూ..కొట్టి వేసిన హైకోర్టు ఈ సారి గెజిట్ నొటిఫికేషన్‌ను కూడా సస్పెండ్ చేసింది. రాజధాని ప్రాంతాన్ని ఆర్5 జోన్‌గా ప్రకటిస్తూ ఇచ్చిన… గెజిట్ నోటిఫికేషన్ 355 ను నాలుగు వారాల పాటు హైకోర్టు సస్పెండ్ చేసింది. రాజధాని మాస్టర్ ప్లాన్‌లో మార్పు చేయాలంటే సీఆర్డీఏలోని సెక్షన్ 41 ప్రకారం.. స్థానిక సంస్థలు, గ్రామ కమిటీల నుంచి అభిప్రాయాలు సేకరించాలని పిటిషనర్లు హైకోర్టులోవాదించారు.
ప్రభుత్వ వాదనను కూడా విన్న ధర్మాసనం .. గెజిట్ నోటిఫికేషన్ ను..సస్పెండ్ చేసింది. వేసవి సెలవుల తర్వాత జూన్ 17కు విచారణ వాయిదా వేసింది. రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూములను ప్రస్తుత ప్రభుత్వ ఇళ్ల స్థలాలుగా మార్చి.. ఇతర ప్రాంతాల్లోని వారికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. సీఆర్డీఏ చట్టం ప్రకారం..రాజధానిలోని 29 గ్రామాల్లోని ఇళ్లు లేని వారికే అక్కడ స్థలాలు కేటాయించాల్సిఉంటుంది. ఈ మేరకు కొంత మంది హైకోర్టులో పిటిషన్లు వేయడంతో..ప్రభుత్వం ఇళ్ల స్థలాల జీవోను కొట్టివేసింది.
దీంతో ప్రభుత్వం సీఆర్డీఏ చట్టంలో మార్పులు చేస్తూ..ఆర్ 5గా మారుస్తూ.. నిర్ణయం తీసుకుంది. అయితే.. నిబంధనల ప్రకారం… అభిప్రాయ సేకరణ జరపకుండా గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడంతో హైకోర్టులోరాజధాని రైతులు పిటిషన్లు వేశారు. విచారణ జరిపిన హైకోర్టు గెజిన్ నోటిఫికేషన్ ను సస్పెండ్ చేసింది. ప్రభుత్వ నిర్ణయాలు ఇలాకోర్టులో వీగిపోవడం పలుమార్లు జరిగింది. అయినా ఏ విషయంలోనూ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు.