ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇలా మూడు రాజధానుల నిర్ణయం తీసుకుని అలా విశాకు ఎగ్జిక్యూటివ్ కేపిటల్ తీసుకెళ్లాలనుకుంటున్నారు. భవనాలు రెడీ చేయిస్తున్నాయి. ఏ మాత్రం సందు దొరికినా.. విశాఖలో తేలేందుతు తహతహలాడుతున్నారు. ఇలాంటి సమయంలో అందరికీ వస్తున్న సందేహం.. కర్నూలు హైకోర్టు. సచివాలయాన్ని విశాఖ తీసుకెళ్లడానికి పెడుతున్న ఎఫర్ట్ల్లో.. కనీసం.. ఒక్క శాతం కూడా.. కర్నూలుకు హైకోర్టు తరలించడానికి చేయడం లేదు. కనీసం.. ఆ ప్రక్రియ కూడా ప్రారంభించలేదు. కర్నూలుకు హైకోర్టుకు తరలించాలంటే.. సుదీర్ఘమైన ప్రక్రియ ఉంటుంది. అది కేంద్రంతో.. సుప్రీంకోర్టుతో ముడిపడి ఉన్న వ్యవహారం. అయినప్పటికీ. ప్రభుత్వం తరపున కనీసం.. ఎలా ముందడుగు వేయాలన్న ఆలోచన కానీ.. ప్రణాళిక కానీ ఉన్నట్లుగా కనిపించడం లేదు.
ప్రకటనలో మాత్రం కర్నూలుకు హైకోర్టుకు ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి… తన అసలు ఎజెండాలో ఆ విషయం ఉందో లేదో చెప్పలేకపోతున్నారు. ఇప్పటికిప్పుడు.. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం సాధ్యం కాదని వైసీపీ వర్గాలు కూడా ఆఫ్ ది రికార్డు చెబుతూనే ఉన్నాయి. మండలి రద్దు చేయగలం అన్న కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు.. కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నప్పుడు.. హైకోర్టును కూడా తరలించడం పెద్ద విషయం కాదు. కానీ అలా చేయడానికి శక్తియుక్తులంతా… కేటాయించడానికి … ఏపీ సర్కార్ సిద్ధంగా లేదు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రస్తుతం.. పోలవరం కానీ.. పరిశ్రమలు కానీ.. పెట్టుబడులు కానీ.. ప్రాధాన్యతాంశాల్లో లేవు. కానీ విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను తీసుకెళ్లడానికి మాత్రం సర్వశక్తులు ఒడ్డుతోంది. దీన్నే అత్యవసరంగా భావిస్తోంది. మరే ముఖ్యమైన అంశమూ లేననట్లుగా… వ్యవహరిస్తోంది. దీనికి తగ్గట్లుగానే మంత్రుల ప్రకటనలు ఉంటున్నాయి. ఈ మంత్రుల ప్రకటనల్లో కర్నూలు హైకోర్టు అంశం బూతద్దం పెట్టి వెదికినా కనిపించడం లేదు.