ఏపీలో వైసీపీ నియమించిన సమాచార కమిషనర్లు తమకు జీతం ఇవ్వలేదని చేసిన గలాటా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆఫీసులకు రాకుండా.. అటెండెన్స్ లేకుండా జీతం ఎలా ఇస్తామని సదరు ఆఫీసర్ ఎదురు తిరగడంతో వారికేం చెప్పాలో అర్థం కాలేదు. తాము టూర్లలో ఉన్నామని సమర్థించుకుంటున్నారు. కానీ అసలు కార్యాలయాలకు రారు..అసలు ఏ పనులు చేయరు. అందుకే జీతం ఆపేశారు.
ప్రఛాన సమచార కమిషనర్ గా మహబూబ్ భాషా ఉన్నారు. మిగతా కమిషనర్లు విధులకు రావడం లేదని అయినా జీత భత్యాలు తీసుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి… విధులకు వచ్చేవారికే జీతాలు ఇవ్వాలని ఆదేశించారు. గత నెల అంతా ముగ్గురు సమాచార కమిషనర్లు విధులకు హాజరు కాలేదు. ఒక్క రోజు కూడా అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం పెట్టలేదు. దాంతో జీతాలురాలేదు. భవిష్యత్ లో వస్తాయన్న గ్యారంటీ కూడా ఉండదు.
ఈ కమిషనర్లు ముగ్గురూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చాయిస్. ఇందులో మాజీ జర్నలిస్టు రెహానా ఒకరు. వైసీపీకి వారు చేసిన సేవలకు గాను ఈ పదవులు … వైసీపీ ప్రభుత్వం ఓడిపోయే ముందు ఇచ్చింది. ఒక్కొక్కరికి మూడేళ్ల పదవీ కాలం . కానీ వైసీపీ అధికారం పోవడంతోనే వీరికీ గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. పని చేయకుండా.. జీతాలు తీసుకోవడం ఎల్లవేళలా సాధ్యం కాదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.