ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు ఢిల్లీకి వెళ్లారు. డిల్లీకి వెళ్లే ముందు ఆయన మీడియాకు డైరక్ట్ గా కాకుండా… తనకు సన్నిహితులైన జర్నలిస్టులకు చెవిలో ఓ మాట చెప్పారు. బ్రో సినిమా పెట్టుబడులపై విచారణ చేయమని అడగడానికి.. కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తానని చెప్పుకొచ్చారు. తన పర్యటనకు అలా హైప్ ఇప్పించుకున్నారు. చివరికి బయలుదేరే ముందు కూడా మీడియాతో మాట్లాడారు. తాను బ్రో సినిమా టీంను ఏదో చేయబోతున్నానని బెదిరించే ప్రయత్నం చేశారు.
అంబటి రాంబాబు ఢిల్లీకి వెళ్లి మూడు రోజులు అవుతోంది. కానీ ఆయన దర్యాప్తు సంస్థలను కలిసింది లేదు కానీ… సినిమా మీద ఫిర్యాదు చేయడానికి వెళ్తే… ఫ్లైట్ చార్జీలు దండగని విమర్శలు వస్తాయని అనుకున్నారేమో కానీ… కేంద్ర మంత్రి షెకావత్ అపాయింట్ మెంట్ తీసుకుని .. పూలగుత్తి ఇచ్చి నవ్వుతూ ఫోటోలు దిగారు. తరవాత ప్రెస్ మీట్ పెట్టి పోలవరం గురించి మాట్లాడారు. కొత్తగా ఆయన మాట్లాడే పోలవరం మాటల్లో విశేషాలు ఏమీ ఉండవు.. ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు అని చెప్పడమే సారాంశం. అది అయిపోయాక కూడా ఢిల్లీలోనే ఉన్నారు.
కేంద్ర దర్యాప్తు సంస్థల్ని కలిసి.. బ్రో సినిమా ఖర్చుపై.. విదేశాల నుంచి వచ్చిన డబ్బుపై ఫిర్యాదు చేయాలనుకున్నారు. విజయసాయిరెడ్డి వెంట వెళ్లాలని ప్రయత్నించారు . అక్కడకు వెళ్లి అతి వినయం చూపించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు వీకెండ్ వచ్చేసింది… అధికారులు అందుబాటులో ఉండే అవకాశం లేదు. మరి బ్రో పై ఫిర్యాదు చేస్తారో.. చేయకుండా వచ్చేస్తారో చూడాల్సి ఉంది.